చంద్రబాబునాయుడుకున్న అధికార కక్కుర్తి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. శాశ్వతంగా ఈ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రిగా ఉండిపోవాలన్నది చంద్రబాబుకున్న బలమైన కోరిక. కానీ మనది ప్రజాస్వామ్యం కద. కాబట్టి చంద్రబాబు కోరిక తీరే అవకాశం లేదు. అందుకని ఏం చేస్తారంటే అధికారంలో ఉన్నపుడే భవిష్యత్తులో చేయాలనుకున్న పనులను కూడా చేసేస్తుంటారు. ఇక్కడే ఉన్నతాధికారులకు సమస్యలు మొదలవుతున్నాయి.

 

తాజాగా ఉన్నతాధికారులు ఇటువంటి సమస్యలతోనే ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు ఉన్నతాధికారులతో సమీక్షలు చేయకూడదన్నది ఎలక్షన్  కోడ్ అమల్లో చాలా కీలకమైనది.  కానీ చంద్రబాబు కోడ్ ను లెక్క చేయకుండా సమీక్షలు చేసేస్తున్నారు. కోడ్ అమల్లో ఉన్నపుడు ఇష్టారాజ్యంగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చిన పనులు చేయించుకున్న ఫలితంగానే చీఫ్ సెక్రటరీ పునేఠా, ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు ముగ్గురు ఎస్పీలపై బదిలీ వేటు పడింది. అదంతా ఎన్నికలకు ముందు జరిగింది.

 

ఇక పోలింగ్ తర్వాత కూడా చంద్రబాబు అదే పని చేస్తున్నారు. రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతో సమీక్షలకు హాజరైతే ఈసితో సమస్యలు, హాజరుకాకపోతే సిఎం, మంత్రుల నుండి ఒత్తిళ్ళు.  చంద్రబాబు సమీక్షలపై ఈసి ఎందుకింత కఠినంగా ఉంది ? ఎందుకంటే, కేర్ టేకర్ సిఎంగా ఉన్న కాలంలో ఏ ముఖ్యమంత్రయినా విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ చంద్రబాబు మాత్రం భూ కేటాయింపులు చేస్తు 18 జీవోలను జారీ చేసేశారు. సరే వాటిని గుర్తించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నిలిపేశారనుకోండి అది వేరే సంగతి.

 

తనకిష్టమైన వారికి ప్రభుత్వ భూములను పందేరం చేయటమంటే అధికార దుర్వినియోగం చేయటం కిందకే వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా భూ కేటాయింపులు ఎలా చేస్తారు ? అందుకే చంద్రబాబు సమీక్షలపై ఈసి తీవ్రంగా స్పందిస్తోంది. అదే పద్దతిని మంత్రులకు కూడా వర్తింపచేస్తోంది. ఈసి చెప్పినట్లు వింటున్నారనే ఎల్వీ పై చంద్రబాబు, మంత్రులు మండిపోతున్నారు.

 

నిజానికి నాలుగుసార్లు సిఎంగా చేసిన చంద్రబాబుకు ఇంతటి అధికార కక్కుర్తి అవసరం లేదు. రేపటి కౌంటింగ్ తర్వత మళ్ళీ అధికారంలోకి వస్తే మొన్నటి వరకూ చేసుకున్నట్లే రాజమార్గంలోనే భూ కేటాయింపులు చేసుకోవచ్చు. కోడ్ అమల్లో ఉండగా నిర్ణయాలు తీసుకోకూడదని తెలిసీ భూ కేటాయింపులు చేశారంటే అధికార కక్కుర్తి కాక మరేమిటి ? 2003లో కూడా ఇదే విధంగా కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా వందలాది ఎకరాలను పందేరం చేసేశారు.  చంద్రబాబు అధికార కక్కుర్తికి చివరకు మంత్రులు చివరకు రోజువారీ సమీక్షలు కూడా చేయలేకపోతున్నారు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: