రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవు. అవి  పారే నీరులా అలా వెల్లువలా  కదులుతూనే ఉంటాయి. ఆటూ పోటూ వాటికి సహజం కూడా. ఈ నిముషానికి సుఖం అనుకుంటే మరు నిముషంలో పెద్ద సంక్షోభం పుడుతుంది. సాగరంలో బడబాగ్ని దాగున్నట్లుగా బయటకు వచ్చి ఎపుడు ఎగిసి బద్దలవుతుందో తెలియదు. అందువల్ల రాజకీయాల్లో  హ్యాపీ అని ఎవరూ తీరిగ్గా కూర్చవడానికి లేదు.


కేసీయార్ విషయమే ఇందుకు అచ్చమైన ఉదాహరణ. ఆరు నెలల ముందు ఎన్నికలు పెట్టుకుని బంపర్ మెజార్టితో గెలిచి అయిదేళ్ళ వరకూ తిరుగులేదనిపించుకున్న కేసీయార్ ప్రభ ఒక్క దెబ్బకు కొడిగట్టుకుపోయింది. ఇంటర్ మీడియట్ ఫలితాల రూపంలో వచ్చిన మంటలు కేసీయార్ సర్కార్ మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా పదుల సంఖ్యలో ముక్కుపచ్చలారని విద్యార్ధులు ఇంటర్ మంటలకు ఆహుతి అయ్యారు. వేలల్లో విద్యార్ధులు ఫ్యూచర్ బెంగతో సతమతమవుతున్నారు. వారి వెనక  వేలాదిగా  తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు.


ఇలా తెలంగాణా సమాజంలో అతి ముఖ్యమైన వర్గాలు ఇపుడు రోడ్డున పడ్డాయి. కేసీయార్ రంగంలోకి దిగినా పరిస్థితి అదుపులోకి రావడంలేదు. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్న నష్టం చాలా దారుణం. సర్కార్ ఇమేజ్ గోవిందా అయింది. ఈ దెబ్బతో లోకల్ బాడీ ఎన్నికల్లో పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక కేసీయార్ పార్టీలో అసమ్మతి కూడా నివురు గప్పిన నిప్పు లా ఏదో రోజు బయటపడుతుందని కూడా అంటున్నారు. మే 23న లోక్ సభ సీట్లలో సగానికి పైగా కేసీయార్ గెలుచుకోకపోతే మాత్రం టీయారెస్ కి గండం ముందు ముందు పొంచి ఉందని చెప్పవచ్చు అంటున్నారు.


సరిగ్గా ఇదే అదను అని చూసుకుని ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు కేసీయార్ కి ఓ పవర్ ఫుల్ పంచ్ వేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన కేసీయార్ పాలనను ఘాటుగా విమర్శించారు. ఒక చిన్న పరీక్ష నిర్వహించలేని వారు దేశాన్ని మారుస్తామని చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు. ఇది ఓ విధంగా కేసీయార్ మీద  సమరానికి ఆరంభం అనుకోవచ్చు. రేపటి రోజున బాబు కనుక ఏపీలో మళ్ళీ గెలిచినట్లైతే కేసీయార్ కి తనదైన శైలిలో చుక్కలు చూపించవచ్చు.  అంతే కాదు చంద్రబాబే ఇపుడు అసలైన రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని అంటున్నారు. మరి చూడాలి కేసీయార్ ఈ గండం నుంచి ఎలా బయటపడతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: