మాజీ వజ్రాల వ్యాపారి, పీఎన్‌బీ స్కాం నిందితుడు నీరవ్‌మోదీకి షాక్‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు చెందిన రూ. 13 వేల కోట్ల స్కాంలో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని ఇటీవ‌లే లండన్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతన్ని లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో హాజరు పరిచారు. నీరవ్‌మోదీ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తాజాగా మ‌రోమారు ఆయ‌న‌కు బెయిల్ విష‌యంలో చుక్కెదురు అయింది.


మోదీ బెయిల్‌ పిటిషన్‌ను లండన్‌ కోర్టు తిరస్కరించింది. బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను లండన్‌ కోర్టు మే 24కు వాయిదా వేసింది. నీరవ్‌మోదీ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడం ఇది మూడోసారి.ముంబైలోని ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్న ఈడీ.. నీరవ్‌మోదీకి చెందిన 13 లగ్జరీ కార్లను వేలం వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.


గతేడాది ఫిబ్రవరిలో ఈ పీఎన్‌బీ స్కాం బయటపడక ముందే నీరవ్ మోదీ దేశం వదిలి పారిపోయాడు. అతని మేనమామ, ఈ స్కాంలో మరో నిందితుడైన మెహుల్ చోక్సీ కూడా దేశం వదిలి వెళ్లిపోయాడు. అతడు కరీబియన్ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్నాడు. అంతకుముందే ఆ దేశ పౌరసత్వం తీసుకున్న చోక్సీ.. ఈ మధ్యే భారత పాస్‌పోర్ట్‌ను కూడా వదులుకున్నాడు. నీర‌వ్ మోదీకి చెందిన 173 పేయింటింగ్స్‌, 11 ల‌గ్జ‌రీ కార్ల‌ను వేలం వేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ కోర్టు అనుమ‌తి తీసుకొని వేలం ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: