ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పెళ్లిళ్లు మూన్నాళ ముచ్చ‌ట‌గా మారుతున్నాయి.. వేధ మంత్రాలు, అగ్ని సాక్షిగా బంధుగ‌ణంతో జ‌రిపించిన వివాహాలు ఇప్పుడు విడాకుల వైపు ప‌య‌నిస్తున్నాయి. ప్రేమ ప‌ళ్లిళ్లు కూడా ఎంతో కాలం నిల‌బ‌డటంలే.. చిన్న‌, చిన్న మ‌న‌స్ప‌ర్థాలు, వ‌ర‌క‌ట్న వేధింపులు, లేదా పెళ్లైన కొంత‌కాలానే భార్య‌పై మోజు తీరిందంటూ వ‌దించుకోవాల‌ని చూస్తున్నారు కొందరు క‌ట్టుకున్న మొగుళ్లూ. దీంతో న్యాయం కోసం అత్తింటి ముందు భార్య‌ల ధ‌ర్నాలు ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ చూస్తూనే ఉన్నాం.


ఒక వైపు భ‌ర్త త‌న‌ను వ‌దిలించుకుని రెండో పెళ్లికి సిద్ద‌ప‌డ్డాడంటూ హైద‌రాబాద్‌లో ఓ బాధితురాలు భ‌ర్త ఇంటి ముందు ధ‌ర్నాకు దిగింది. ఇటు మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకుని వ‌దిలేశాడంటూ క‌ర్నూలు జిల్లాలో మ‌రో బాధితురాలు పోలీసుల‌కు ఆశ్ర‌యించింది. అయితే ఈ రెండు ఘ‌ట‌న‌ల్లో భ‌ర్త‌ల‌పై భార్య‌లు చేస్తున్న పోరాటానికి మ‌హిళా సంఘాలు మ‌ద్ద‌తుగా నిలిచాయి. 


హైద‌రాబాద్ స‌న‌త్ న‌గ‌ర్ పీఎస్ ప‌రిధిలో ఓ భార్య భ‌ఱ్త ఇంటి ముందు ధ‌ర్నాకు దిగింది. అగ్ని సాక్షిగా తాళిబొట్టుక‌ట్టిన భర్త రెండో పెళ్లికి సిద్ద‌ప‌డ్డాడ‌ని ఆరోపిస్తూ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఆందోళ‌న చేప‌ట్టింది. త‌న‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు త‌న పోరాటం సాగిస్తాన‌ని తెగేసి చెప్పింది. స్థానిక శివాజీన‌గ‌ర్‌లోనివాసం ఉంటున్న శివ‌కుమార్‌, ల‌క్ష్మీ దంప‌తుల‌కు 11 ఏళ్ల క్రితం వివాహం జ‌రిగింది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. 


ఇంత‌కాలం సంతోషంగా, హ్యాపీగా సాగుతున్న త‌మ సంసారం ఇప్పుడు రోడ్డున ప‌డింది. పెళ్ల‌యిన ఇన్నేళ్ల త‌ర్వాత శివ‌కు ల‌క్ష్మీపై మోజు తీరిపోయింద‌ని.. రెండో పెళ్లికి సిద్ధ‌ప‌డ్డాడు. దీంతో త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి భ‌ర్త ఇంటి ముందు బైఠాయించిన బాధితురాలు ఆందోళ‌న‌కు దిగింది. త‌న‌కు త‌న పిల్ల‌ల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు ఆందోళ‌న విర‌మించేది లేద‌ని తెగేసి చెప్పింది. ల‌క్ష్మీకి మ‌ద్ద‌తుగా మ‌హిళా సంఘాలు కూడా ధ‌ర్నాలో పాల్గొన్నాయి. 


అటు  క‌ర్నూలు జిల్లాలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే జరిగింది. నందికొట్కూరు బైరెడ్డి న‌గ‌ర్లో భ‌ర్త ఇంటి ముందు భార్య ధ‌ర్నాకు దిగింది. త‌న భ‌ర్త వేరే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకుని త‌న‌ను వ‌దిలేశాడంటూ బాధితురాలు ఆరోపించింది. త‌న భ‌ర్త మ‌హ్మ‌ద్ ర‌ఫిని త‌న‌కు అప్ప‌గించాల‌ని కోరుతూ భార్య స‌లీమాబీ మ‌హిళా సంఘాల‌తో క‌లిసి ధ‌ర్నాకు దిగింది. 


జిల్లాలోని సుల్తాన‌పురం గ్రామానికి చెందిన ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ మ‌హ్మ‌ద్ ర‌ఫీతో 8 ఏళ్ల క్రితం స‌లీమాబీతో వివాహం జ‌రుగ‌గా.. వీరికి ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. సంసారం సాఫీగా సాగుతున్న టైమ్‌లో త‌న భ‌ఱ్త మ‌రో మ‌హిళ‌తో ద‌గ్గ‌ర‌య్యాడ‌ని.. ఇక అప్ప‌ట్నుంచి త‌న‌ను వేధించేవాడ‌ని బాధితురాలు ఆరోపించింది. ర‌ఫీతో త‌న‌కు ప్రాణ‌భ‌యం ఉంద‌ని, అందుకే తాను గ‌త కొంత‌కాలంగా భ‌ర్త‌కు దూరంగా ఉంటున్నాన‌ని చెప్పింది. అయితే గ‌తంలోనే భ‌ర్త‌పై తాను పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశాన‌ని తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: