రాయలసీమకే కాదు యావదాంధ్రప్రదేశ్ కు తలమానికంగా ఉండేది శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ).  డాక్లర్లను, ఇంజనీర్లను, లాయర్లను అనేకానేక వృత్తుల మేథావులను ప్రపంచానికి అందిస్తూ 65 ఏళ్ళ ఘనకీర్తిని గడించింది ఈ విశ్వవిద్యాలయం.  


తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత, శ్రీవారి పేరు మీద నడపబడే ఈ విశ్వవిద్యాలయం ఎంత ఉన్నతంగా ఉండాలి? విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, రెక్టార్ ల వంటి నాయకులు వారి ప్రవర్తన ఎంత గంభీరంగా, హుందాగా ఉండాలి?


గత రెండు మూడు సంవత్సరాలుగా దక్షిణ భారత దేశంలోనే నెం.1 విశ్వవిద్యాలయంగా ర్యాంకును పొందింది,  నేషనల్ స్థాయి ఈ వెంట్ లనెన్నింటినో విజయవంతంగా నిర్వహించి, ఎస్వీయూ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది అని అనుకున్నారు ఆంధ్రప్రజ.


ఈ ఆరు నుండి తొమ్మిది నెలల వ్యవథిలో ఎస్వీయూ పై వస్తున్న ఆరోపణలు అన్నీ-ఇన్నీ కావు.  సాక్షాత్తు ఎస్వీయూ వీసి పై ఆరపణలు, రిజిస్ట్రార్ అర్హత లేకుండా..తప్పు అర్హతలతో రిజిస్ట్రార్ పదవి చేజిక్కించుకుని ఎస్వీయూని పక్కా ఒక పార్టీ ఆఫీసులాగా తయారు చేసిందని ఆరోపణలు, ఎస్వీయూ రెక్టార్ ఆడియో లేపుల కలకలం.  


సంవత్సరాల తరబడి జరిగిన పరీక్షల ప్రొవిజనల్ సర్టిఫికెట్లు దిక్కులేదు, యూనివర్సిటీ బాధ్యతలనేకం పెండింగ్ ఫైళ్లు రూపంలో పురుగులు పట్టి పోతున్నాయి, విద్యార్థుల భవిత్యం నావనం అవుతుంది.  ఎస్వీయూ మేనేజిమెంటు మొత్తాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని అంటునన్నారు ఆంధ్రప్రజ. 


మరింత సమాచారం తెలుసుకోండి: