ఏపీలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపైన జరిగిన ఎగ్టిట్ పోల్ సర్వే ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఒకటి రెండు తప్ప మెజారిటీ ఎగ్టిట్ పోల్ సర్వే ఫలితాలు ఏపీలో ఫ్యాన్ గాలి గిర్రున తిరిగిందని  చెప్పుకొచ్చాయి. లగడపాటి సర్వేతో పాటు, మరో రెండు సర్వేలు మాత్రం టీడీపీ గెలుస్తుందని తెలిపాయి. 


మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని వెల్లడించాయి. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ రోఉ  సాయంత్రం వెల్లడయ్యాయి. లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా కట్టాయి. తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది.


లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది. టీడీపీ​కి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది. అలాగే,  ఆరా సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.  టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల ప్రకారం వైఎస్సార్‌సీపీకి 18 సీట్లు టీడీపీకి 7 సీట్లు రావొచ్చని అంచనా. ఇక న్యూస్‌ 18- ఐపీఎస్‌ఓఎస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీకి 13 నుంచి 14 సీట్లు వస్తాయి. టీడీపీ 10 నుంచి 12 సీట్లు దక్కించుకుంటుంది.


మొత్తానికి జగన్ ముఖ్యమంత్రి అని అన్ని ఎగ్టిట్ పోల్ సర్వే ఫలితాలు తేల్చేశాయి. ఇది ఓ విధంగా అసలైన ఫలితాలకు  ముందు జగన్ పార్టీకి తీయని కబురుగానే చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: