2019 శాసనసభ ఎన్నికల్లో ఘోర పరభావం చవి చూసిన జనసేన పార్టీ ఇప్పుడు మరో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉండాలని జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్ నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసి ప్రజల ఆదరణ సంపాదించాలని భావిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టాలన్నారు. 


సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు నిజం చేస్తూ జనసేన పార్టీ పక్షాన ఒక పత్రిక పెడుతామని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పత్రిక స్వరూప స్వభావాలు, శీర్షకలు, తదితర అంశాలను నిర్ణయించడానికి కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు.. గురువారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. 


తాను గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీచేసినప్పటికీ సమయాభావం వల్ల ఏనియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోవడం వల్లనే ఓటమి ఎదురైనట్టు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల్లో ఓటమిపై ఆ పార్టీ అధినేత పవన్ సమీక్షిస్తున్నారు.

శుక్రవారం జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో ఈస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, జిల్లాల జనసేన పార్టీ అభ్యర్థులతో పవన్ సమావేశంకానున్నారు.  ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి లతో ఎన్నికలలో ఓటమికి గల కారణలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రానున్న స్ధానిక ఎన్నికలపై నాయకులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: