- నిత్య కోతలతో అల్లాడిపోతున్న సామాన్యులు
అసలే ఎండల తీవ్రత ... ఆపై విద్యుత్తు కోతలు. సామాన్య, మధ్య తరగతి ప్రజల కష్టాల కోసం వేరే చెప్పక్కరలేదు. ఇన్వెర్టర్‌ సదుపాయం లేని వారి పరిస్థితి మరీ దుర్భరం. ఎయిర్‌ కండీషనర్స్‌ పనిచేయక ఉక్కిరిబిక్కిరి అయ్యే మధ్య తరగతి జనం బాధలు వర్ణనాతీతం. విద్యుత్త్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని పలువురు విద్యుత్తు శాఖ అధికారుల తీరును దుయ్యబడుతున్నారు.

గత కొద్ది రోజులుగా విద్యుత్ శాఖ పనితీరు అధ్వాన్నంగా తయారయింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా నిరంతరం విద్యుత్ కోత విధిస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఎప్పుడు కరెంట్ ఉంటుందో .. ఎప్పుడు ఉండదో తెలియని అయోమయ పరిస్థితి దాపురిస్తోంది. 


కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తారాస్థాయికి చేరుకుంది. ఇక కరెంటు ఉన్నా ఈ ప్రాంతంలో లో ఓల్టేజి సమస్య శాశ్వత సాంప్రదాయంగా మారిపోయింది. ఇదేమిటని కారణం అడిగినా సరైన సమాధానం చెప్పే నాధుడు కూడా ఆ శాఖలో కన్పించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.


 ఆ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారులకు తీరిక లేదు, దిగువ స్తాయి సిబ్బందికి ఓపిక లేదు అన్నట్టుగా తయారైంది పరిస్థతి. అసలే మండుతున్న ఎండాకాలానికి తోడు ప్రజలతో విద్యుత్ శాఖ ఆటలాడుతున్న తీరు.  తరచుగా విద్యుత్ సరఫరాలో  అంతరాయానికి కారణం ఏమిటో చెప్పకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ప్రజల సహనాన్ని పరీక్షించడం విద్యుత్ శాఖ అధికారులకు సరైంది కాదని  వింతాటగా మారింది. ప్రభుత్వం మారడంతోనే విద్యుత్ కడగండ్లు మొదలవడం దేనికి సంకేతమో ఆ లోగుట్టు పెరుమాళ్ళుకే ఎరుక.



మరింత సమాచారం తెలుసుకోండి: