ఈసారి వర్షాకాలం ఆలస్యంగా మొదలైంది.దానితో ఇన్ని రోజులు వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు.కాని కర్నూలు లోని రైతులు మాత్రం ముకుందాపురం గ్రామానికి తరిలి వెళ్తున్నారు.

అక్కడ జరిగిన ఓ వింత అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నిన్న  తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని ముకుందాపురం గ్రామంలో చిన్నపాటి వర్షంతో పాటు ఆకాశం నుండి కప్పలు కూడా పడ్డాయని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇవి పచ్చ రంగులో ఉన్నాయి.ఇది విన్న జనమంతా ఆ వింతను చూడడానికి వెళ్తున్నారు.నారు మడి కోసం తయారుచేసిన పొలంలో ఇలా పసుపు రంగులో కప్పులు ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఉదంతం విన్న కొందరు ఆశ్చర్యపోతుంటే మరికొందరు భారీ సుడిగాలిలతో ఆకాశం లోకి వెళ్ళిన కప్పలు వర్షంతో పడి ఉంటాయని మరికొందరు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: