తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు యూ టర్న్ బాబు అని ముద్దు పేరు ఉంది. ఆయన ఒక మాట మీద నిలబడరని అందరినీ తెలిసిందే. ఎపుడూ కూడా ఆడి తప్పడం అలవాటుగా మారిపోయింది. అధికారంలో ఉన్నపుడు ఇచ్చిన హామీలే కాదు, విపక్షంలో  ఉన్నపుడు చెప్పిన మాటలు కూడా బాబు తప్పేస్తున్నారు.


జగన్ పాలనపై ఏడాది పాటు చూద్ద్దాం, ఎవరూ మాట్లాడవద్దు, ఇదీ బాబు గారు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పార్టీ నేతలతో చెప్పిన మాట. కానీ కనీసం నాలుగు రోజులు కూడా ఆగకుండా విమర్శలు మొదలెట్టేశారు. ఇపుడు నెలరోజులైందిగా పీక్స్ కి వెళ్ళిపోతున్నాయి మాటల తూటలు. జగన్ని సీఎంగా తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఫ్రాక్షనిస్ట్  సీఎం అయితే ఎలా ఉనటుందో చూస్తున్నామని టీడీపీ నాయకులు కామెంట్స్ చేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. 


సినిమా టూ చూసినట్లుగా ఉందిట. అంటే వైఎస్సార్ పాలన వన్ అన్న మాట. మరి తమ్ముళ్లకు అంతలా జగన్ ఎందుకు భయపెట్టేస్తున్నారు. అదేం కాదు అధికారం పోయింది. ఘోరావమానం మిగిలింది. ఇక చేసేదేమీ లేక రాళ్ళేసే కార్యక్రమానికి దిగిపోతున్నారు. ఓ వైపు అసూయ, మరో వైపు అక్కసు, ఇంకోవైపు అసహనం, మొత్తానికి తమ్ముళ్ళకు పూనకం వచ్చేస్తోంది. జగన్ని ఫ్రాక్షనిస్ట్ అంటూ హాట్ కమెంట్స్ చేస్తున్నారంటే ముందు ముందు ఏ రేంజిలో రెచ్చిపోతారో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: