నిన్న నరాలు తెగేలా సాగిన ప్రపంచ కప్ పోటీలో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పొందింది. దాంతో ప్రపంచ కప్ పోటీల నుంచి తప్పుకుంది.  అయితే మొన్ననే పూర్తి కావాల్సిన ఆట వర్షం కారణంగా ఆగిపోవడం నిన్న తిరిగి ప్రారంభం అయ్యింది.  అయితే 240 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆటగాళ్లు కేవలం 5 రన్స్ కే 3 వికెట్లు అదీ నెంబర్ వన్ ఆటగాళ్లు కుప్పకోలిపోయారు.

ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు కష్టపడ్డా అవుట్ అయ్యారు. భారత్ దారుణమై పరాజయం అవుతుందన్న సమయంలో  రవీంద్ర జడేజా, ధోనీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ పరవు కాపాడారు.  ఒకదశలో భారత్ అలవోకగా గెలుస్తుందన్న నమ్మకాన్ని ఈ ఆటగాళ్లు పెంచారు. మంచి ఫామ్ లో ఉన్నజడేజా ఔట్ కావడంతో భారత్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. 

కేవలం 18 పరుగుల తేడాతో ఓడిపోయారు.  తాజాగా ఈ ఓటమిపై ఓ వైపు విమర్శలు వస్తుంటే..మొత్తాని పోరాడి ఓడారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా భారత్ ఆటగాళ్లపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ మ్యాచ్ ఫలితం తనను తీవ్రంగా నిరాశపరిచిందని మోదీ అన్నారు. అయితే... టీం ఇండియా విజయం కోసం చివరి వరకూ పోరాడి తన స్ఫూర్తిని ప్రదర్శించిందని అన్నారు.

ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో భారత్‌ ఆకట్టుకుందని ఆయన గుర్తుచేసుకున్నారు.  గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం అన్నారు. ఏది ఏమైనా మాంచెస్టర్‌లో కివీస్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో రవీంద్ర జడేజా, ధోనీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పోరాడినప్పటికీ భారత్‌ ఓటమి పాలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: