అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు మొదటి గంటలోనే చంద్రబాబునాయుడు మొహం మాడిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం జరిగిన చర్చలో చంద్రబాబును జగన్ దాదాపు ఉతికి ఆరేశారు. తెలంగాణాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వెళ్ళటాన్ని టిడిపి తప్పు పట్టింది.

 

టిడిపి ఆరోపణలకు జగన్ సమాధానమిస్తు తాను వెళ్ళినా వెళ్ళకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం అయితే ఆగదన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారభమైనపుడు సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా ? అంటూ మండిపోయారు.

 

తాను సిఎంగా ఉన్నపుడు ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనపుడు ఏమీ మాట్లాడని చంద్రబాబు ప్రాజెక్టు ప్రారంభానికి తాను హాజరైతే తప్పు పట్టడమేంటన్న జగన్ ప్రశ్నకు టిడిపి నుండి సమాధానమే లేదు. అంతటి ఆగకుండా చంద్రబాబు హయాంలోనే కర్నాటక, మహారాష్ట్రలో నిర్మించిన ప్రాజెక్టులు, దాని వల్ల ఏపికి జరిగిన అన్యాయం మొత్తాన్ని జగన్ వివరించి చెప్పటంతో చంద్రబాబు మళ్ళీ నోరెత్తలేదు.

 

సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ అనుభవాన్ని తక్కువ చేస్తున్నట్లు మాట్లాడటం విచిత్రంగా ఉంది. తన రాజకీయ అనుభవం అంతలేదు జగన్ వయసు అంటూ  పాత పాటనే వినించారు చంద్రబాబు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చవకబారు రాజకీయం చేస్తునే ఇది రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అంశమంటూ జనాలను రెచ్చ గొట్టే ప్రయత్నం చేయటం గమనార్హం.  జగన్ చర్యల వల్ల  భవిష్యత్తరాలు దెబ్బ తినబోతున్నట్లు చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేయటం విడ్డూరంగా ఉంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: