జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం చంద్రబాబునాయుడు వల్ల కావటం లేదని అర్ధమైపోయింది. అందుకే చంద్రబాబుకు రక్షణగా ఎల్లో మీడియా రంగంలోకి దిగేసింది. ఎల్లోమీడియా రంగంలోకి దిగిందంటే ఇంకేముంది విషప్రచారానికి కొదవే లేదు. అసెంబ్లీలో కానీ బయటకానీ చంద్రబాబు మాట ఎక్కడా చెల్లుబాటు కావటం లేదని ఎల్లోమీడియాకు కూడా అర్ధమైపోయింది. అందుకే జనాలను మాయ చేయటానికి తానే స్వయంగా నడుంకట్టింది.

 

 

చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు, అమారవతి నిర్మాణం, విద్యుత్ పిపిఏల్లో జరిగిన అవినీతిని బయటపెట్టటానికి జగన్ కమిటిలు వేశారు. దాంతో  జగన్ వేసిన కమిటిలు అవినీతిపై విచారణ జరపటం, సమీక్షలు చేయటం మహా అపరాధం అన్నట్లుగా రెచ్చిపోతోంది. జగన్ సమీక్షల వల్లే ప్రపంచబ్యాంకు అప్పు ఇవ్వకుండా వెనక్కు వెళ్ళిపోయిందని అబద్ధాలు ప్రచారం చేస్తోంది.

 

కేంద్ర వైఖరి వల్లే తాము అప్పు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు స్వయంగా ప్రపంచబ్యాంకు చెప్పినా ఎల్లో మీడియా మాత్రం జగన్ దే తప్పన్నట్లు ప్రచారం చేస్తోంది. ఇక పోలవరం, పిపిఏల సమీక్షలను ఆపేయాలంటూ గగ్గోలు పెడుతోంది. పిపిఏల సమీక్షల వల్ల విద్యుత్ ఉత్పత్తి సంస్ధలు వెనక్కు వెళ్ళిపోయే అవకాశాలున్నట్లు చెబుతోంది. పోలవరం అవినీతిని బయటకు తీయాలని జగన్ అనుకుంటుంటే కాంట్రాక్టు సంస్ధలు వెనక్కు పోతాయని భయపెడుతోంది.

 

అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు చేసిన అవినీతి బయటపడితే టిడిపి పని గోవిందా. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న టిడిపి పరిస్ధితి మరింతగా దిగజారిపోతుంది. అదే జరిగితే ఎల్లో మీడియా కూడా కష్టాల్లో పడుతుంది. అందుకే ఎలాగైనా చంద్రబాబును కాపాడుకునేందుకే ఎల్లో మీడియా బాధ్యతలు తీసుకున్నట్లే కనబడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: