చిత్రమేంటో కానీ తెలుగుదేశం పార్టీని స్థాపించిన అన్న నందమూరిని ఆ పార్టీ పెద్దగా గుర్తుంచుకోదు. అదే సమయంలో వైసీపీ మాత్రం నందమూరిని మరచిపోనంటోంది. తన పాదయాత్రలో క్రిష్ణా జిల్లాకు అన్న గారి  పేరు పెడతానని జగన్ ప్రకటించిన సంగతి విధితమే. ఇక అన్న గారి కుటుంబల్లో ఓ అల్లుడిని కూడా పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చారు.


ఇపుడు అన్న గారికి మంచి మిత్రునిగా సన్నిహితునిగా మెలిగిన డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జగన్ కీలకమైన బాధ్యతలు అప్పగిస్తున్నారు. మాజీ ఎంపీ యార్లగడ్డను తెలుగు భాషా సంఘం చైర్మన్‌గా నియమించనున్నారు. ఈ విషయాన్ని  మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రకటించారు. తెలుగు భాషకు పెద్ద పీట వేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని  మంత్రి చెప్పారు.


కాగా యార్లగడ్డ టీడీపీలోనే రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. అదే విధంగా ఆయన నందమూరి హరిక్రిష్ణకు కూడా సన్నిహితునిగా మెలిగారు. చంద్రబాబు తో విభేదించే యార్లగడ్డ అన్న గారి కుటుంబం అంటే ప్రాణం పెడతారు. అటువంటి యార్లగడ్డకు సముచిత స్థానం ఇవ్వడం ద్వారా జగన్ అన్న గారికి కూడా మరో మారు గౌరవించినట్లైందని ఎన్టీయార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: