ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ అధినేత పసిగట్టలేకపోయారు. చేసిన తప్పులను పదే పదే చేసుకుంటూ పోయారు. దీనితో ఆ పార్టీ ఎప్పుడు చూడలేనంతగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 40 ఏళ్ల యువకుడైన జగన్ ..  రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టి 40 ఏళ్ల ఇండస్ట్రీని పాతాళకంలోకి తొక్కేశారు. చంద్రబాబు చివర్లో ఎన్నో  సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టినా ప్రజలు వాటిని విశ్వసించలేదు. దీనితో బాబుకు మరో సారి ప్రతి పక్షంలో కూర్చోక తప్పలేదు. 


అయితే జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, జగన్ సాధించిన భారీ మెజారిటీ ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే చంద్రబాబు భవిష్యత్ అంధకారంలోకి పోయినట్టేనని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ పార్టీ నుంచి పెద్ద పెద్ద తలకాయలు బీజేపీలోకి జంప్ అయ్యారు. కొంత మంది అయితే అసలు బయటికి కనిపించడం మానేశారు. చంద్రబాబు బినామీగా చెప్పుకునే నారాయణ ఇప్పుడు నెల్లూరులో కూడా కనిపించడం లేదు. 


కడప ఫైర్ బ్రాండ్ ఆది నారాయణ అధికారం ఉన్నప్పుడు ఓ రేంజ్ లో రెచ్చిపోయేవారు. ఇప్పుడు అయన ఊసే లేదు. టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో కూడా మొహం చాటేస్తున్నారు. దీనితో టీడీపీ పార్టీకి దూరం కావటానికి ఇప్పటికే చాలా మంది తెలుగు తమ్ముళ్లు రంగం సిద్ధం చేసుకున్నారని ..  అది ఆగస్ట్ సంక్షోభం రూపంలో ఉప్పెనలా బయటపడనున్నదని సమాచారం వస్తుంది. బీజేపీ ..  టీడీపీని ఎప్పుడెప్పుడు ఫినిష్ చేయాలనీ ఎదురు చూస్తుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: