వైసీపీ నాయకుల్లో ప్రతిపక్షాన్ని విమ‌ర్శించ‌డంలోనూ, జ‌గ‌న్‌ పై వ‌స్తున్న విమ‌ర్శల‌కు సరైన స‌మాధానాన్ని  విశ్లేషాత్మకంగా  చెప్పడంలోనూ  కొలుసు పార్థసార‌థి రేంజే వేరు. మంత్రిగా చేసిన అనుభవంతో  ఏ విషయాన్ని అయినా..  కొలుసు అనర్గళంగా మాట్లాడుతుంటారు. అయితే కొలుసు పార్థసార‌థి తాజాగా బాబు పై  మరియు  టీడీపీ నాయకుల పై విచ్చలవిడిగా విరుచుకుపడ్డారు.  టీడీపీ నాయకుడు దేవినేని ఉమా ఒట్టి  చేతకాని దద్దమ్మ అని.. అలాంటి దద్దమ్మను తాను గతంలో  ఎక్కడా చూడలేదని.. ఇప్పటికైనా ఆ దద్దమ్మ అసత్యారోపణలు మానుకోకపోతే  దేవినేని ఉమా నాలుక కోస్తానంటూ  తీవ్ర విమర్శలు చేశారు.  చంద్రబాబునాయుడు మరియు  నారా లోకేష్‌ ల పై కూడా విరుచుకు పడుతూ..  అధికారంలో  ఉన్నంతసేపూ   రాష్ట్రాన్ని పెద్దబాబు  చిన్నబాబు కలిసి దివాళా తీయించారని..  అందుకే బాబులిద్దరికీ  ప్రజలు ఎన్నికల్లో తీవ్రంగా బుద్దిచెప్పారని.. అయినా  వారిలో మార్పు మాత్రం రాలేదని పార్థసార‌థి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


 ఈ మధ్య నారా లోకేష్  అర్ధం లేని ట్వీట్లతో ఒట్టి తుగ్లక్‌ లా వ్యవహరిస్తున్నాడని..  జగన్‌  ప్రజాసంక్షేమం కోసం  చూస్తున్నారని..  కానీ టీడీపీ నాయకులూ మాత్రం  అభివృద్ధికి సహకరించకుండా.. మా ప్రభుత్వం పై  బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని  పార్థసార‌థి అన్నారు. అయితే ఉన్నట్టు ఉండి కొలుసు పార్థసార‌థి  టీడీపీ నాయకుల పై  ఇలా ఆరోపణలు మరియు విమర్శలు చెయ్యడానికి ఓ కారణం ఉందట.  ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు వ్యవహారంలో కొలుసు పార్థసార‌థి అవినీతి చేశాడని టీడీపీ నాయకులు  దుష్ప్రచారం చేస్తున్నారన్నారట.  అవినీతి రహిత రాష్ట్రం కోసం ప్రయత్నిస్తామని చెప్తూ.. పూర్తిగా రౌడీయిజం చలయిస్తూ..  అసలు  నీతిలేని పాలన చేస్తున్నారని ఆ మధ్య బాబు విమర్శించారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యల పై కూడా  ఇన్ డైరెక్ట్ గా పార్ధసారధి స్పందిస్తూ... బాబు  మైండ్ లేకుండా అవాకులు చవాకులు పేలుతున్నాడని కోప్పడ్డారు. 


ఇంతకీ  కొలుసు పార్థసార‌థి  చేసిన ప్రధాన ఆరోపణల్లో ముఖ్యంగా   'నవయుగ'కి పనులు కేటాయించి బాబు కోట్లు దోచుకున్నారట.   నవయుగకి పనులన్నీ నిబంధనలకు విరుద్దంగానే  కేటాయించారట.  రాష్టాన్ని చంద్రబాబు పూర్తిగా  ఆర్ధిక సమస్యల్లోకి నెట్టేశారని..  తమ ప్రభుత్వం బాబు చేసిన ఘోరాలని చక్కదిద్దే ప్రయత్నం చేస్తోందని.. ఈ విషయాలు ఏమి తెలియని లోకేష్  ఉత్త మాలోకంలా తయారయ్యాడని వెటకారంగా ఎద్దేవా చేశారు. మరి  కొలుసు పార్థసార‌థి  ఆరోపణలు మరియు విమర్శల పై బాబులిద్దరూ ఎలా స్పందిస్తారో.. !



మరింత సమాచారం తెలుసుకోండి: