స్వతంత్రం వచ్చి ఏడు పదుల వయసు అవుతున్న భారత్ ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగా ఉండడానికి కారణం ఇప్పటివరకు పరిపాలించిన పాలకులు మరియు వారు అనుసరించిన విదేశీ విధానాల వల్లే అనే చెప్పాలి.కాని గత బీజేపీ ప్రభుత్వ హయాం నుండి భారత్ అభివృద్ది విదేశీ విధానాల వల్ల విజయాలు రోజు రోజుకీ పెరుగుతూ పోతున్నాయి.

పాకిస్తాన్ నుండి అభినందన విడుదల, కులభూషన్ ఉరిని ఆపించి వేయడం,ఇరాన్ నుండి అమెరికా ఆంక్షలు ఉన్నా పెట్రోల్ కొనుగోలు చేయడం ఇవ్వన్నీ విదేశీ విధానాల విజయాలు అయితే చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం అవ్వడం ఆయుధాలను ఇతర దేశాలకు అమ్ముతూ కొత్త వ్యాపారంలో అడుగుపెట్టడం ఇతర దేశాల కంపెనీలను మన దేశానికి రప్పించడం అభివృద్ది పరంగా మరో అడుగు ముందుకు వేస్తూ సాధించిన విజయం.

ఇలా గత బీజేపీ హయాం లో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన దూకుడు ప్రదర్శిస్తున్న మోడీ ఇప్పుడు కాశ్మీరు విషయంలో తీసుకున్న సంచలన నిర్ణయం గురించి దేశమంతట చర్చలు జరుగుతున్నాయి.కాశ్మీరు తర్వాత మోడీ అండ్ షా ద్వయం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో అని సరిహద్దు దేశాలైన పాక్ మరియు చైనా తో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది.దేశ రక్షణ రంగానికి మరియు అంతరిక్ష రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో క్లిష్టంగా మారిన ప్రాంతాలను వాటి సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించింది.దానిలోని భాగంగానే ఆర్టికల్ 370 రద్దు చేసింది.

లడక్ ను చట్టసభ లేని కేంద్ర పరిపాలిత ప్రాంతంగా మార్చింది.ప్రస్తుతం మోడీ ప్రభుత్వం తాము సాధించిన విజయాలతోనే కాకుండా తమ నిర్ణయాలతో అటు దేశ ప్రజలను మరియు ప్రపంచం చూపు ను తమ వైపు తిప్పుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: