ముఖ్యమంత్రి జగన్ రెండు నెలల పాలన ఏపీలో సవ్యంగానే సాగుతోంది. అనుకూల మీడియాతో టీడీపీ తాటాకు చప్పుళ్ళు చేస్తున్నా కూడా జగన్ తనదైన శైలిలో పాలన గాడిన పెడుతున్నారు. గతంతో పోలిస్తే ఉద్యోగులలో అకౌంటబిలిటీ పెరిగింది. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా తెలుసుకుని మరీ అమలుకు సిధ్ధమవుతున్నారు. నిన్న సోమవారం ఏపీవ్యాప్తంగా జరిగిన స్పందన కార్యక్రమానికి   జనం వెల్లువలా తరలివచ్చారంటే అది ప్రభుత్వ భారీ విజయంగానే పరిగణించాలి.


ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందన్న నమ్మకంతోనే అర్జీదారులు అధికారుల చుట్టూ బారులు తీరారు. విశాఖలో అయితే అనూహ్య రీతిలో స్పందనకు జనం తరలివస్తున్నారు. వచ్చిన వారిని జగన్ చెప్పినట్లుగానే  అధికారులు కూడా బాగా  రిసీవ్ చేసుకోవడంతో ప్రభుత్వంపై పాజిటివ్ నెస్ పెరుగుతోంది. ఇదిలా ఉండగా జగన్ ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన సీఎం అయ్యాక‌ జగన్ ఢిల్లీ టూర్ చేపట్టడం ఇది రెండవసారి.



ఈసారి జగన్ టూర్ రెండు రోజుల పాటు సాగనుంది. కేంద్ర  మంత్రులను, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను జగన్ కలసి ఏపీ సమస్యలపైన నివేదికలు ఇస్తారు. అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు గురించి వివరిస్తారు. విధ్యుత్ ఒప్పందాలపైన రివ్యూ ఎందుకు అన్న దానికి కూడా క్లారిటీ ఇస్తారు. పోలవరం రీ టెండరింగ్ విషయంలోనూ జగన్ ప్రధానికి తనదైన వివరణ ఇస్తారని అంటున్నారు.


ఇక ఏపీకి విభజన చట్టంలో ఉన్న మేరకు చాలా రావాల్సివుంది. వాటిని జగన్ ప్రధాని ద్రుష్టికి తీసుకురావడం ద్వారా మెజారిటీ సమస్యలకు పరిష్కారం సాధించాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీ ఆర్ధికంగా నానా రకాలుగా ఇబ్బందులు పడుతోంది. దాన్ని కేంద్రానికి  తెలియచేయడం ద్వారా ఏపీని ఉదాంగా ఆదుకోవాలని జగన్ కోరనున్నారు.  ఇక రాజకీయపరంగా కూడా మోడీతో జగన్ విభేదాలు లేవని చెప్పనున్నారు.


 తాజాగా కాశ్మీర్ అంశం మీద మద్దతు ఇచ్చి విజయసాయిరెడ్డి రాజ్యసభలో హాట్సాఫ్ మోడీ , షా అంటూ చేసిన ప్రసంగం తో జగన్ తన స్టాండ్ ఏంటన్నది చెప్పకనే చెప్పారు.  వైసీపీ విషయంలో  ఎటువంటి అపోహలూ పెట్టుకోకుండా కేంద్రం ఏపీ విషయంలో తన సాయాన్ని అందించాలని జగన్ కోరనున్నారు. మరి సీఎం రెండు రోజుల టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీకి గుడ్ న్యూస్ జగన్ చెబుతారా, ఆయన టూర్లో కొత్తగా ఏమైనా ఏపీకి తెస్తారా అన్నది జనంలో చర్చగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: