కృష్ణా నదిలో నెలకొన్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీటిని ఇవ్వాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని జలసౌధలో ఈరోజు ఇంజనీర్ ల కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆయా ప్రాజెక్టుల పరిధిలో నీటి విడుదలపై ఈ భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా నదిలో బుధవారం కూడా భారీ వరద ప్రవాహం నమోదైంది. రెండు మూడు రోజులలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశముంది.


ఎగువన వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టికి భారీగా వరద వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు సుమారు మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో దిగువకు నాలుగు లక్షల క్యూసెక్ కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల క్యూసెక్ కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో పక్క ఉజ్జైయిని నుంచి కూడా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల క్యూసెక్ కుల నీటిని విడుదల చేశారు. దీంతో జూరాలలో ప్రస్తుతం మూడు పాయింట్ రెండు ఐదు లక్షల క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం భారీగా పెరగనుంది. శ్రీశైలంలోకి రెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల క్యూసెక్కుల వరద నమోదైంది. వచ్చే రెండు మూడు రోజుల్లో ఇది ఐదు లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని ఇంజనీర్ లు అంచనా వేస్తున్నారు .


రెండు రోజుల్లో ప్రాజెక్ట్ నిండితే గేట్లను ఎత్తుతారు. ఇప్పటికే జల విద్యుదుత్పత్తి ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా కృష్ణాలో నెలకొన్న వరద ప్రవాహాన్ని అంచనా వేస్తే సాగర్ ఆయకట్టు పరిధిలోని మొత్తం విస్తీర్ణానికి సాగునీటిని అందించే అవకాశముంది. నిన్నటి నుంచి సాగర్ జల విద్యుదుత్పత్తి కూడా మొదలు పెట్టారు. దీని ద్వారా సుమారు పధ్ధెనిమిది వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు.


మరోవైపు ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి ఆయా రాష్ర్టాలకు కేటాయించాల్సిన నీటి కోటాను ఖరారు చేయటానికి కృష్ణా బోర్డు శుక్రవారం సమావేశం కావాలని నిర్ణయించింది. కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: