జమ్మూ కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతి పత్తి ని భారత్ రద్దు చేయడంతో పాకిస్థాన్ కడుపు మండి పోతుంది. దీనికి ప్రతి చర్యగా పాకిస్తాన్ భారత్ తో వాణిజ్య సంబంధాలను తెంచుకున్నది. అయితే కాశ్మీర్ వాణిజ్య సంబంధాలను తెంచుకోవటం వల్ల భారత్ కు వచ్చిన నష్టమేమి లేదని చెప్పాలి. ఎందుకంటే భారత్  పాకిస్తాన్ మధ్య వాణిజ్య వ్యాపారాలు నామమాత్రమేనని చెప్పాలి. భారత్ ఎక్కడో ఉన్న అమెరికాతో భారీగా వాణిజ్య వ్యాపారాలు చేస్తుంది గాని పక్కనే ఉన్న పాకిస్థాన్ తో పెద్దగా ఎగుమతులు దిగుమతులు లేవని చెప్పాలి. అయితే పాకిస్థాన్ ...  కాశ్మీర్ విషయంలో ఏదో జరిగిపోయినట్టు కలరింగ్ ఇస్తుంది. 


పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ చర్య యుద్ధ వాతావరణాన్ని రేకెత్తించే విధంగా ఉందని, ఈ చర్యతో ఇంకా ఉగ్రదాడులు పెరుగుతాయని, పుల్వామా లాంటి దాడులు జరిగే అవకాశం ఇంకా ఉంది అని భారత్ మీద విషం కక్కుతూ మాట్లాడినారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ చెబుతూ మేము ఐక్యరాజ్య సమితికి వెళతాము. అక్కడే తేల్చుకుంటామని చెప్పిన సంగతీ తెలిసిందే. 


అయితే పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ ను కొంచెం తగ్గించుకోవాలని అమెరికా కూడా హెచ్చరించిన సంగతీ తెలిసిందే. అయితే జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియా యెక్క అంతర్గత వ్యవహారం. ఈ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చుకోవటం ఇండియా ఇష్టం. ఎందుకంటే కాశ్మీర్ అనేది ఇండియాలో ఒక భాగం . అంతేగాని కాశ్మీర్ ఏమి పాకిస్థాన్ లో లేదా చైనా లేదు. కానీ ఎందుకో గాని పాకిస్థాన్ కుక్కలు ఇంకా మొరుగుతూనే ఉన్నాయి. అయితే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ .. పాకిస్తాన్ వాణిజ్య సంభందాలు తెచ్చుకోవటం వల్ల భారత్ కు వచ్చిన నష్టం కేవలం కోహ్లీ తన ఇన్ స్టాగ్రాం లోఒక వాణిజ్య ప్రకటనకు అయ్యే ఖర్చు మాత్రమేనని .. అదిరిపోయే సెటైర్ వేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: