ఏపిలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ది సంక్షేమ విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.  గత పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రభుత్వంలో పడకూడదని అధికారులు, మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూ అన్ని విషయాలపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.  ఈ నేపథ్యంలో పెట్టుబడులపై ఆయన ఫోకస్ పెట్టడం మొదలు పెట్టారు.


రాష్ట్రంలో సుస్థిరమైన పాలన ఉందని ప్రజలు సంపూర్ణ మెజార్టీతో మమ్మల్ని గెలిపించారని, పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు కలిగి ఉన్నామని ,కేంద్రం అండదండలు కూడా రాష్ట్రానికి పుష్కలంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  విజయవాడ novotel లో జరుగుతున్న పెట్టుబడుల అవగాహన సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సదస్సుకు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు స్వాగతం.


 సమావేశానికి 30 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. మాకు 975 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది.. 6ఓడరేవులు ఉన్నాయని జగన్ తెలిపారు.
అవినీతి రహిత పాలన అందిస్తున్నామని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు వివాదాస్పదమైంది .. పి.పి.ఏ ల వల్లరాష్ట్రానికి లాభం లేకపోవడం వల్లే రద్దు చేసాము.  వివిధ దేశాలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ,హోటల్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్,టూరిజం, వంటి రంగాలలొ అభివృద్ధి ఉంది.


మరో నాలుగు ఓడరేవులు రాష్ట్రానికి రానున్నాయని 6 విమానాశ్రయాలు ఉన్నాయి.. హెల్త్ సెక్టార్ వంటి కీలక రంగాల్లో పెట్టడం వల్ల ఉపయోగంగా ఉంటుందన్నారు.  ప్రభుత్వ స్థిరంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మాకు 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఉన్నారు. చివరగాప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి సుబ్రహ్మణ్యం  అతిధులకు రాష్ట్రంలో సౌకర్యాలు వివరించి వందన సమర్పణ చేశారు..



మరింత సమాచారం తెలుసుకోండి: