మహారాష్ట్ర వర్షాల వల్ల వరదలు ఉదృతి ఎక్కువగా ఉంది. మంత్రి గిరీష్ మహాజన్ వరదలతో బాధపడుతున్న ఒక జిల్లా లో పర్యటన లో సెల్ఫీలు దిగారని, ఉల్లాసంగా చేతులు ఊపుతూ ఉన్నట్టు పెట్టిన ఒక పోస్ట్ చాలా దుమారం లేపింది. 
కానీ తరువాత శనివారం ట్వీట్ చేసిన ఒక వీడియోలో, అతను మునిగిపోయిన గ్రామానికి చేరుకోవడానికి ఈత కొట్టుకుంటూ వెళ్ళాడని తేలింది.


ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన మహాజన్ శనివారం మహారాష్ట్రలోని సాంగ్లిలో పర్యటించారు,
 ఇది వరద భీబత్సం వల్ల బాగా దెబ్బతిన్న జిల్లాలలో ఒకటి, అక్కడికి చేరుకున్నాక అతను నవ్వుతూ, 
చేతులు ఊపుతూ  పడవలో నిలుచుని సెల్ఫీలకు పోజులిచ్చినటువంటి వీదియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆయన మేద తీవ్రంగా మండి పడ్డారు.


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్ర వరద పరిస్థితిని చాలా భయంకరంగా అభివర్ణించిన తరుణంలో ఇలాంటి వీడియో‌ రావటం వల్ల చాలా మంది మహజన్ తీరుపై విరుచుకు పడ్డారు.రెండు రోజుల క్రితం, 
సహాయక చర్యల్లో నిమగ్నమైన పడవ బోల్తా పడటం  వల్ల   14 మంది మరణించగా, సాంగ్లిలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.


"సబ్కా విశ్వస్ " అని ప్రధాని నరేంద్ర మోడీ వాడే ఒక నినాదాన్ని వాడుతూ తాను ఆ ట్వీట్‌ ను  అందరితో‌ పంచుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: