ఆర్టికల్ 370ని రద్దు చేసిన బిజేపి ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ కోలీవుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ ప్రధాని మోది, కేంద్రం హోంమంత్రి అమిత్ షాలను కృష్ణార్జులతో పోల్చారు. రజిని చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. రజినికాంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఊహించలేదని అన్నారు తమిళనాడు పిసీసీ అధ్యక్షుడు కే.ఎస్ అళగిరి.         


ముస్లీంలు ఎక్కువగా ఉన్నారనే కారణంతోనే బిజేపి ప్రభుత్వం కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిందని. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన స్పెషల్ స్టేటస్ కేంద్రం ఎందుకు తొలగించలేదని అళగిరి మండిపడ్డారు. ఇలాంటి ద్వంద్వ నీతి రాజకీయాలను రజిని సమర్ధిస్తున్నారా.. అంటూ రజినిపై ఫైర్ అయ్యారు. దేశ ప్రజల హక్కులను హరించిన మోదీ, అమిత్ షాలను కృష్ణార్జులతో ఎలా పోల్చుతారంటూ రజినిపై ఫైర్ అయ్యారు.     


అంతేకాదు రజినికాంత్ మరోసారి మహాభారతాన్ని చదివి అందులోని అశాలను అర్ధం చేసుకోవాలని సూచించారు. ఆర్టికల్ 370 రద్దు చేయడంపై చెన్నైలో జరిగిన లెజనింగ్.. లెర్నింగ్.. లీడింగ్ పుస్తకావిష్కరణలో రజిని స్పందించడం జరిగింది. మోదీ, అమిత్ షాలను కృష్ణార్జునలతో పోల్చిన రజిని ఎవరు కృష్ణుడు, ఎవరు అర్జునుడు అన్నది వారికే తెలుసని చెప్పడం విశేషం. 


సినిమాలైతే చేస్తున్నా రజిని రేంజ్ హిట్ కు దూరంగా ఉంటుండగా ఈమధ్య రజిని రాజకీయపరమైన మీటింగులకు ఎక్కువ అటెండ్ అవుతున్నారు. సొంత పార్టీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడన్న వార్తలు రావడమే తప్ప.. రజిని పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఊహించని విధంగా ఇలా బిజేపికి సపోర్ట్ గా మాట్లాడటం కాంగ్రెస్ నాయకులకు చిర్రెత్తుకొచ్చింది. ఆర్టికల్ 370 రద్దు పై బిజేపిని మెచ్చుకున్న రజినిని కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేశారు. అళగిరి కామెంట్స్ కు రజిని నుండి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.       


మరింత సమాచారం తెలుసుకోండి: