నిజంగా రైతులు ఎంత అమాయకులో దీన్ని బట్టి అర్ధమైపోతోంది. రాజధాని, తమ సమస్యలకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటాలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు.  పవన్ మద్దతు కోరుతు రాజధాని ప్రాంతంలోని రైతుల్లో కొందరు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వీళ్ళకు పవన్ అపాయిట్మెంట్ ఏమీ ఇవ్వలేదు. అయినా కానీ పవన్ను కలుద్దామని వెయిట్ చేస్తున్నారు.

 

సరే వీళ్ళతో పవన్ మాట్లాడుతారా లేదా అన్నది వేరే విషయం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమ పోరాటానికి మద్దతుగా నిలబడతారని, తమ తరపున పోరాటాలు చేస్తారని రైతులు పవన్ ను ఎలా నమ్మారన్నదే అర్ధం కావటం లేదు. ఎన్నికలకు ముందే రైతుల సమస్యలపై పవన్ స్పందించింది లేదు. ఒకసారి రాజధాని ప్రాంతంలో తిరిగి రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

 

రైతుల పొలాలను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే వాళ్ళ తరపున ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ చాలా భీకరంగా ప్రతిజ్ఙ చేశారు. ఏదో డ్రమటిక్ గా అక్కడే వారితోనే కూర్చుని పెరుగన్నం తిన్నారు. కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోయారు. అంతే మళ్ళి ఇప్పటి వరకూ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేదు. కనీసం ఎన్నికల్లో మిత్రపక్షంగా పోటి చేసిన సిపిఐ అభ్యర్ధి తరపున వెళ్ళి మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం కూడా చేయలేదు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికలకు ముందే రైతుల తరపున పోరాటాలు చేయని పవన్ కల్యాణ్ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన తర్వాత వాళ్ళ మొహాలు చూస్తాడా అని. ఎటువంటి మందమతులైనా ఎన్నికల ముందు ఓట్లు పడే ఎటువంటి అవకాశాన్ని వదులుకోరు. అలాంటిది అప్పుడే పవన్ రాజధాని రైతుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ఇక ఇప్పుడేం ఉద్యమాలు చేస్తారు ? ఏదో వచ్చారు కాబట్టి మొక్కుబడిగా మాట్లాడి పంపించేస్తారేమో ? చూద్దాం ఏం చేస్తారో ?


మరింత సమాచారం తెలుసుకోండి: