తిరుమల అన్యమత ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. టికెట్ కేటాయింపులో నిర్లక్ష్యం వహించిన అధికారిని సస్పెండ్ చేస్తూ, ఒక సంస్థలో ఉంటూ వేరే మతం స్వీకరిస్తే ఉపేక్షించేది లేదంటుంది. అలాంటి వారు వెంటనే టీటీడీ నుంచి వెళ్ళిపోవాలని సూచించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం. తిరుమల ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రచారం జరగడం పై తీవ్ర దుమారం రేగింది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆర్టీసీ నెల్లూరు జోనల్ స్టోర్స్ కంట్రోలర్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తిరుమల పవిత్రత కాపాడటం తమ బాధ్యత అన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం. ఆర్టీసి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు.


ఈ ఆర్టీసీ బస్సుల్లో వాడిన టికెట్ లు దాని వెనకాల ఇతర మతాలకు సంబంధించిన ప్రచారం ఏదైతే జరిగిందో అది చాలా గర్హనీయమైన చర్య ఇందులో ఆర్టీసీ వారి యొక్క నిర్లక్ష్యం కనిపిస్తున్నది.అంటే స్థానికంగా ఉన్న ఆర్టీసీ యాజమాన్యం గారు వారి జాగ్రత్తతో ఉండుంటే ఇలాంటి సమస్య తలెత్తేది కాదు. ఇక పై ఎండో మెంట్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగులందరి ఇళ్లల్లోనూ ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు సీహెచ్ సుబ్రహ్మణ్యం. సంస్థలో పని చేస్తూ వేరే మతం స్వీకరిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వారు బయటకు వెళ్లిపోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇతర మతాల్ని వాళ్ళు స్వీకరించారు. స్వీకరించడానికి వాళ్ల ఇష్టం దాన్ని ఎవరూ నిర్బంధించడానికి లేదు. కాని వారు ఈ ఉద్యోగంలో వాళ్లు కొనసాగించడానికి అవకాశం ఉండదు లేదా ప్రధానమైన బాధ్యతలు స్వీకరించడానికి ఉండదు. ఎందుకంటే మనోభావాలను దెబ్బతీయడం ఎవరికీ కూడా అది శ్రేయస్కరం కాదు. అలా ఎవరు చేయకూడదు. వారికున్న మతాన్ని వాళ్ళు అవలంభించుకోవచ్చు.



వాళ్ళు వాళ్ళ ఇంట్లో చూపించుకోవచ్చు. కానీ నేడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్నాను నేను హిందువును కాను అని ఎవరైనా చెప్పగలిగితే, ఆ ధైర్యం వుంటే వాళ్ళు చెప్పి ఈ సంస్థ నుంచి వైదొలగి వెళ్ళిపోవాలి. అన్యమత ప్రచార నివారణ కోసం సీఎం జగన్ తో చర్చించి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం చేయకూడదని గతంలో ఇచ్చిన జీవోలను మరింత పకడ్బందీగా రూపొందించి అమలు చేస్తామన్నారు. తిరుమల పర్యటనలో సిఎస్ అన్యమత ప్రచారం శ్రీ వారి బ్రహ్మోత్సవాలు,మ్యూజియంలు వాటి అభివృద్ధి పై టిటిడి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. తిరుమల పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: