రాష్ట్రంలో కీలక సమస్యలపై ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్న నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూరుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఉదయం నుండి మూడు సమావేశాలతో బిజిబిజీగా గడిపిన జగన్ తిరిగి అమరావతికి వచ్చేశారు. ఢిల్లీలో ఉదయం ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న తర్వాత  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తర్వాత జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు.

 

మొదటి సమావేశం గురించి రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదు కానీ మిగిలిన రెండు సమావేశాలపైనే అందరూ దృష్టి పెట్టారు. ఎందుకంటే అమిత్ షా, షెకావత్ తో జరిగిన భేటీలే కేంద్రంపై జగన్ కున్న పట్టును చాటి చెబుతాయి. అందుకనే అందరూ రెండు సమావేశాలపైనే ఆసక్తి చూపించారు. అమిత్ షా, షెకావత్ తో జరిగిన భేటిలో జగన్ తన వాదనను సమర్ధవంతంగానే వినిపించారనే అంటున్నారు.

 

పోలవరం రివర్స్ టెండరింగ్ తో పాటు రాజధాని మార్పు అంశాలపైనే జగన్ ప్రధానంగా చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. రివర్స్ టెండర్ విషయంలో అమిత్ షా ను గనుక ఒప్పించగలిగితే  జగన్ టూర్ సక్సెస్ అయినట్లే. జగన్ వాదనతో షా గనుక సానుకూలమైతే  షెకావత్ తో భేటి  లాంఛనమే అనుకోవచ్చు. ఎందుకంటే జగన్ కు అనుకూలంగా షా మాత్రమే నరేంద్రమోడిని కన్వీన్స్ చేయగలరు. అందుకే టిడిపితో పాటు బిజెపి నేతలు కూడా జగన్ టూర్ విషయంలో టెన్షన్ పడిపోతున్నారు. ఇక రాజధాని విషయం పూర్తిగా జగన్ చేతిలోనే ఉంటుంది.

 

ఇద్దరు కేంద్రమంత్రులతో భేటి తర్వాత జగన్ మాత్రం ఖుషీగానే కనిపించారు. పై సమావేశాల్లో ఏమి జరిగింది అన్నది  తెలియాలంటే జగనే చెప్పాలి. లేదా రెండు మూడు రోజుల తర్వాత కేంద్రం నుండి రెస్పాన్స్ బట్టి ఎవరికి వారుగా అంచనా వేసుకోవాలి. అప్పటి వరకూ ఈ సస్పెన్స్ తప్పదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: