మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా, అందులో నీళ్లున్నాయా, అదేమైనా వాటర్ ట్యాంకరా లేకపోతే బిందెలు, కుండలా నీళ్లుండటానికి. గ్యాస్ సిలెండర్లో గ్యాస్ ఉండకపోతే ఏముంటుంది.? ఏం చెప్తున్నారు అని ఆగ్రహం చెందకండి. మీకు సిలెండర్లో గ్యాస్ ఉంటుందని ముందే తెలుసు ఉన్నట్టుంది. ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్ లోకి వెల్దాం.

ఏ సిలిండర్ లోనైనా గ్యాసే ఉంటుందని తెలుసు కాని ఎండాకాలంలో ఒక పూటకు సరిపడా నీళ్లు కూడా ఉంటాయని ఈ సంఘటన చూసిన తరువాతే తెలిసింది. సిరిసిల్లలో ఉండే అరవింద నెగ్గి అనే వ్యక్తి ఇంట్లో ఉన్న గ్యాస్ పొయ్యి ఉన్నట్టుండి ఒక్కటే సారి ఆగిపోయిందట.

ఆరె మొన్నమొన్ననె తెచ్చి పెట్టిన కొత్త సిలెండర్ కదా అప్పుడే అయిపోయిందా అని ఆందోళన చెంది ఊపగా గుడగుడా అంటుంది గాని పైపు పెట్టి వెలిగిస్తే గ్యాస్ పొయ్యి వస్తలేదనేని ఆ ఇండియన్ సిలెండర్ ను వంపి చూస్తే మిషన్ భగీరథ పైపులకు హోల్ పడితే కారినట్టు నీరు కారుతూనే ఉన్నాయంట. ఆ ఇండియన్ సిలెండర్ లో నుంచి నీళ్లు గండి పడ్డ కాలువ పారుతున్న తీరు చూసిన సంఘటన అక్కడ అందరికీ తెలిసి వెంటనే ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళి ఎందుకైనా మంచిదని సిలెండర్లను వంపి చెక్  చేసుకున్నారట.

మరి అందులో గ్యాసే ఉన్నదా లేకుంటే నీళ్ళు నిల్వ ఉన్నాయా అని. ఇక అరవింద్ దరిద్రం కాకపోతే తనకు వచ్చిన సిలెండర్ లోనే ఈ నీళ్ళు ఏంటి అని ఏజెన్సీ ముందు ఆందోళన చేశాడు. గ్యాస్ ఏజెన్సీల వాల్లది పొరపాటా లేకుంటే నింపే దగ్గర ఏమైనా మోసం జరిగిందా అనేది మొత్తానికీ తెలియాలి అంటున్నాడు. కానీ విన్నారు కదా ఎందుకైనా మంచిది సిలిండర్ లను నిండి ఉన్నదని కాకుండా  ఒకసారి నిదానంగా చెక్ చేసుకోండి.



మరింత సమాచారం తెలుసుకోండి: