ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలకు మరు పేరు. మంచితనానికి నిదర్శనం అని అంటున్నారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు. ఎక్కడ కష్టం ఉంటె అక్కడికి వచ్చి మీ కష్టాలను తీరుస్తా అన్నట్టు వ్యహరిస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి కురిచీలో కూర్చున్నప్పటి నుంచి ప్రతిక్షణం ప్రజల కోసం కేటాయిస్తూ పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.                                           


పాదయాత్రలో ఇచ్చిన హామీలు ప్రతి ఒకటి అమలు చేస్తూ ఆంధ్ర రాజ్యాన్ని నవరత్నాల రాజ్యంలా తీర్చి దిద్దుతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీంతో పసి పిల్లల నుంచి వయో వృద్ధుల వరుకు ప్రతి ఒక్కరికి ఆ పథకాలు అమలు అయ్యేలా చూస్తూ దివంగత ముఖ్యమంత్రి రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.                               


ఈ నేపథ్యంలోనే రాజధాని రైతులకు తీపి కబురు అందించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాజధాని రైతుల వార్షిక కౌలు చెల్లింపు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రూ. 187.4 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఏటా కౌలు రూపేణా జూన్ మొదటి వారంలో వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేది. 


అయితే గత కొన్నిరోజులుగా కౌలు నిధుల విడుదలపై రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: