మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ తో చంద్రబాబునాయుడు షాక్ తిన్నారు. గంటా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని రెండు డిమాండ్లు చేశారు. మొదటిది విశాఖపట్నాన్ని ఆర్ధిక రాజధానిగా ప్రకటించాలట. ఇక రెండోది రాజధాని ప్రాంతంలో జరిగిన భూకుంభకోణాన్ని బయటపెట్టాలట. గంటా చేసిన రెండు డిమాండ్లు చంద్రబాబు కొంప ముంచేవే అనటంలో సందేహం లేదు.

 

రాజధానిని అమరావతి నుండి ఓ ఇంచు కదల్చినా ప్రళయం సృష్టిస్తామని చంద్రబాబు దగ్గర నుండి టిడిపి నేతలంతా జగన్ కు వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. టిడిపి ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరి కూడా చంద్రబాబు హెచ్చరికలనే ఫాలో అయిపోతున్నారు. సరే వీళ్ళే కాదులేండి చంద్రబాబుతో కలవాలని అనుకుంటున్న పవన్ కల్యాణ్ కూడా ఇంచుమించు ఇలాంటి హెచ్చిరికలే చేశారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే యావత్ టిడిపి అంతా రాజధాని విషయంలో ఒకే డిమాండ్ చేస్తుంటే అదే పార్టీ ఎంఎల్ఏ అయిన గంటా మాత్రం విశాఖను ఆర్దిక రాజధానిగా ప్రకటించమని డిమాండ్ చేయటం దేనికి సంకేతమో అర్ధంకాక టిడిపి నేతలు జుట్టు పీక్కుంటున్నారు. ఇక రెండో డిమాండ్ అంటారా మొదటిదానికన్నా ప్రమాదకరమైన డిమాండే అనటంలో సందేహం లేదు.

 

 రాజధాని ప్రాంతంలో టిడిపి నేతలు పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు మంత్రి బొత్సా సత్యానారాయణ బాంబు పేల్చిన విషయం తెలిసిందే. తన ఆరోపణలకు మద్దతుగా చంద్రబాబు హయాంలో సుజనా, నారా లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ కొన్న భూములు, సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చిన వైనాన్ని బొత్స వివరాలతో సహా బయటపెట్టారు. దాన్ని సీఆర్డీఏ కూడా నిర్ధారించిది. అంటే చంద్రబాబు కుటుంబం అడ్డంగా దొరికిపోయినట్లే. ఇన్ సైడర్ ట్రేడింగ్ సమస్యలో నుండి ఎలా బయటపడాలో అర్ధంకాక చంద్రబాబు నానా అవస్తలు పడుతుంటే గంటా తాజా డిమాండ్డ మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: