పవన్ కళ్యాణ్ ప్రముఖ సినిమా నటుడు. ఆయన డైరెక్టర్ ఏది చెబితే చేసే నటుడు. రాజకీయల్లోకి వచ్చిన తరువాత కూడా పవన్ బాబు డైరెక్షన్లోనే ముందుకు సాగుతున్నారని వైసీపీ గట్టిగానే విమర్శలు చేసింది. దానికి ప్రతిఫలంగా ప్రజలు టీడీపీతో పాటు జనసేనను కూడా దారుణంగా ఓడించారు. పార్టీ పుట్టగానే ఇలాంటి ఓటమి అంటే జనసేన కోలుకోలేని పరిస్థితే మరి.


అయినా రాజకీయ పార్టీ అన్న తరువాత అపుడపుడు చడీ చప్పుడు చేయాలి కాబట్టి పవన్ సమీక్షలు జరుపుతూ వచ్చారు. ఇపుడు ఆయన కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ మీద డైరెక్ట్ ఫైట్ కి సిధ్ధమవుతున్నారు. వంద రోజుల వరకూ వైసీపీ సర్కార్ మీద కనీసం విమర్శలు చేయనని చెప్పిన పవన్ అదే మీడియా మీటింగులో జగన్ని ఘాటుగా విమర్శించేశాక వ్రతం ఎటూ చెడిపోయింది. ఇపుడు జనంలోకి వచ్చి నాలుగు రాళ్ళు రువ్వడం వల్ల తనదైన రాజకీయం చేసుకునేందుకు పవన్ సిధ్ధంగా ఉన్నారని అంటున్నారు.


అయితే పవన్ తన పార్టీ కోసం రాజకీయాలు చేసుకోవడంలో తప్పులేదని, కానీ టీడీపీకి మేలు చేకూర్చేలా అమరావతి టూర్ పెట్టుకున్నాడనే ఇపుడు విమర్శలు రావడం విశేషం. నిజానికి అమరావతి రాజధానిని ప్రజారాజధాని కాదు అన్ని తొలిసారిగా అన్నది ఇదే పవన్ కళ్యాణ్. అన్ని వర్గాల ప్రజలు రాజధానికో సుఖ సంతోషాలతో ఉండాలని, కానీ అమరావతి మాత్రం కొంతమందికే పరిమితం అయ్యేలా నిర్మిస్తున్నారని నాడు పవన్ గట్టి ఆరోపణలే చేశారు.


దాని మీదనే ఇపుడు వైసీపీ సర్కార్ కూడా ఆలోచనలు చేస్తోంది. ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. పవన్ జనసేనకు మాత్రం అది కనిపించడంలేదా అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో 2015లో పర్యటించిన పవన్ నాడు రైతులను ఆదుకుంటానని, బలవంతంగా భూ సేకరణ చేసిన వారిని ల్యాండ్ పూలింగ్ నుంచి తప్పిస్తానని కూడా చెప్పారు.


ఆ తరువాత జరిగింది ఏమీ లేదు, ఇపుడు మాత్రం పవన్ రాజధాని అక్కడే నిర్మించమని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు అండగా ఉంటానని అంటున్నారు. మరి పవన్ ఏ రైతులకు అండగా ఉంటారు, నాడు చెప్పినట్లు బలవంతంగా భూములు కోల్పోయిన వారికా, లేక మొత్తం మూడు పంటలు పండే భూములు పోయి జీవితాలు నిస్సారమైన వారికా, లేక ఆ భూములలో బంగారం పండించుకుని రియల్ వ్యాపారంతో వేల కోట్లకు పడగెత్తిన వారి కోసమా అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మరి 


మరింత సమాచారం తెలుసుకోండి: