భారత్-పాక్ సరిహద్దుల్లో మళ్లీ తుపాకులు పేలుతున్నాయి. సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ రేంజర్లు దాడులకు పాల్పడుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమాయకులను బలితీసుకుంటున్నారు. కాశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి విధ్వంసం సృష్టిస్తోంది. 


ఆర్టికల్ 370 రద్దైనప్పటి నుంచి పాక్ పాలకులు భారత్‌పై విషం కక్కుతుంటే... మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తోంది పాక్ సైన్యం. రెండు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నా...కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలన్న నిబంధననను పాకిస్థాన్ చెత్తబుట్టలో పడేసినట్టు కనిపిస్తోంది. చొరబాట్లను ప్రోత్సహించడం, సరిహద్దు గ్రామాలపైకి రేంజర్లను ప్రయోగించడం లాంటి చర్యలతో రోజు రెచ్చగొడుతోంది పాకిస్థాన్.  


కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ విషయంలో చారిత్రక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలా ముందుకెళ్లాలో అంతుపట్టక యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాక్... రెండు దేశాల సరిహద్దుల వెంబడి.. కాల్పులకు తెగబడుతోంది. పూంచ్ సెక్టార్ పరిధిలో యదేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఆగస్టు 15 నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి... పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని భారత సైన్యం చెబుతోంది.


పాక్ బలగాల కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి తూటాలు దూసుకొస్తాయో...ఎప్పుడు మోర్టార్ షెల్స్ ఇంటిపై పడతాయో అంతుపట్టక టెన్షన్ పడుతున్నారు. సరిహద్దు గ్రామాల్లో పాఠశాలలు కూడా తెరచుకోవడం లేదు. పిల్లలను స్కూల్స్‌కు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడంపై మన దేశ ప్రభుత్వం సీరియస్ అవుతోంది. దిమ్మతిరిగేలా ఎలా గట్టిగా బుద్ది చెప్పాలో నిర్ణయించుకుంది. ఇప్పటికే ఏకాకి అయిన పాక్ కుక్కతోక వంకరలా ప్రవర్తిస్తోంది. ఆ వంకరను సరిచేసేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది భారత్.  




మరింత సమాచారం తెలుసుకోండి: