పవన్ కళ్యాణ్ మీడియా ముందు ఆవేశంగా మాట్లాడటం .. తరువాత వాటి గురించి మరిచిపోవటం జనసేన అధినేతకు అలవాటేనని ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంది. ఇది వరకు పవన్ కళ్యాణ్ చాలా చెప్పిండు కాని తరువాత వాటి గురించి మరిచి పోతారు. దీనితో పవన్ కళ్యాణ్ ఎన్నికలో ఘోర ఓటమిని చవి చూశారు. ప్రజలు పవన్ కళ్యాణ్ ను ఒక సీరియస్ పొలిటిషన్ గా అసలు పరిగణించలేదు. ప్రత్యేక హోదా విషయమే తీసుకుంటే,  జాతీయ స్థాయిలో మద్దతు కూడగడతా అన్నాడు .. తరువాత దాని సంగతీ మరిచిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ గారి చరిత్ర చాలానే ఉంది. గత ఐదేళ్లలో ఏదైనా సమస్య కోసం పవన్ కళ్యాణ్ ఏదైనా ఉద్యమాలు .. ధర్నాలు చేశారంటే సమాధానం తడుముకోకుండా చెప్పొచ్చు. ఏమి చేయలేదని... కానీ మీడియా ముందు ఆవేశంగా డైలాగ్స్ చెబుతారు. 


అందుకే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎవరు పెద్దగా పట్టించుకోరు. పవన్ ఇప్పుడు లేటెస్ట్ గా మోడీని కలుస్తానని చెప్పారు. ఒకప్పుడు కేంద్రం మీద విరుచుకుపడిన పవన్ సారు ... మరీ ఇప్పుడెందుకు కలుస్తున్నాడో ...! అయితే గత ఐదేళ్లలో చంద్రబాబును ఒక్క సారి కూడా ప్రశ్నించని పవన్ .. జగన్ అధికారంలోకి వచ్చి కనీసం మూడు  నెలలు కూడా కాక ముందే ప్రతి విషయంలో అర్ధం పర్ధం లేకుండా విమర్శలు చేస్తున్నారు.


మోడీని కలుస్తానని పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో భయంకరంగా సెటైర్లు పడుతున్నాయి. ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ .. నేను మోడీని కలుస్తానని చెప్పుకొచ్చారు. కానీ అవన్నీ పవన్ మరిచిపోయారు. మళ్ళీ ఇప్పుడు మోడీని కలుస్తానంటున్నారు ఇది కూడా కొన్ని రోజులు పోతే పవన్ గారు మరిచిపోతారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీకి సపోర్ట్ చేశారో అప్పుడే జనాల్లో టీడీపీ — జనసేన ఒకటేనని ఫీలింగ్ వచ్చింది. అయితే టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు మళ్ళీ పాత  స్నేహాలను వెతుక్కునే పనిలో పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: