ఆన్లైన్ గేమ్‌ విషయంలో ఇప్పటి పిల్లలు వ్యవహరుస్తున్న తీరు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది.ముఖ్యంగా పబ్‌జీ గేమ్..ఇప్పటికే మానసిక నిపుణులు,ఆరోగ్య నిపుణులు ఎన్నో సందర్భాల్లో,ఎన్నో సార్లు హెచ్చరించారు కూడా ఈ గేమ్‌ అనేవి పిల్లల మెదడు పనితీరు వ్యవస్దపై చెడు ప్రభావాన్ని చూపించి వారిని మందబుద్దులుగా మారుస్తాయని.అయినా పిల్లల నుండి పెద్దల వరకు ఆడటం మానలేదు.ఇక కొన్ని రకాలైన గేమ్‌లు ప్రాణాలు కూడ తీసాయి,తీస్తున్నాయి.గేమ్‌లు ఆడకని చెప్పినా దుప్పట్లో దూరి అందరి కళ్లుగప్పి ఆడిన పిల్లోడు చావు అంచులకు వెళ్లి తిరిగొచ్చాడు.వివరాల్లోకి వెళ్ళితే..



వనపర్తికి చెందిన కేశవర్ధన్ (18) అనే యువకుడు డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు.చదువులో చురుకుగా ఉండే అతడు కొద్ది రోజులుగా ఆన్‌లైన్ వీడియో గేమ్ పబ్‌జీకి అలవాటు పడ్డాడు.ఈ క్రమంలో నెల రోజులుగా సెల్‌ఫోన్లో పబ్‌జీ ఆడుతూ దానికి బానిసయ్యాడు.పబ్‌జీ ఆటే కేశవర్ధన్ ప్రపంచమైంది.పగలనక, రాత్రనక ఆ ఆట ఆడుతూ ఉండిపోయాడు.చదువు మాట దేవుడెరుగు..తిండీ,తిప్పలు కూడా మానేసి పబ్‌జీ ఆడేస్తూ బతికాడు.ఎప్పుడు చూసినా సెల్‌ఫోన్‌తో బిజీగా గడుపుతూ ఉండే వాడు.ఎప్పుడు రూంలోనే కూర్చుని ఫోన్ పట్టుకుని కనిపించే కుమారున్ని అతని తల్లి చాల సార్లు హెచ్చరించింది.అయినా తల్లి కళ్లుగప్పి రాత్రి పూట దుప్పటి కప్పుకొని మరీ పబ్‌జీ ఆడేవాడు.ఇంకేం అది ఆరోగ్యం మీద గట్టిగా దెబ్బేసింది. సమయానికి ఆహారం,మంచినీరు తీసుకోక నెల రోజులు గడిచేసరికి పూర్తిగా నీరసించి,బక్కచిక్కి అనారోగ్యం పాలయ్యాడు.



వారం రోజుల కిందట కేశవర్ధన్‌కు జ్వరంతో పాటు వాంతులయ్యాయి.దీంతో అతడి తల్లి స్థానికంగా ఓ ఆసుపత్రిలో చూపించారు.అక్కడ వైద్యుడు కొన్ని మందులేవో రాసిచ్చినా,అవేమీ పనిచేయలేదు.మూడు రోజులు గడిచినా జ్వరం తగ్గకపోవడం,తిరగబెట్టిన వాంతులతో డీహైడ్రేషన్‌ పెరిగింది.చివరికి మెదడుపై తీవ్ర ఒత్తిడి పడి పరిస్థితి విషమంగా మారింది.బాధితుడి కుడికాలు,కుడిచేయి కదపలేని స్థితికి చేరడంతో గత నెల 26న హుటాహుటిన ఆసుపత్రికి తరలించాగా, న్యూరో ఫిజీషియన్‌ డాక్టర్‌ అతన్ని పరీక్షించి,మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నరాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల యువకుడి ఆరోగ్య పరిస్థితి దిగజారినట్లు తెలిపారు.సమయానికి ఆహారం తీసుకోకపోవడం,నిద్రలేమి వల్ల శరీరంలో సోడియం, పోటాషియం స్థాయిలు తగ్గి అది చివరికి మెదడుపై ప్రభావం చూపిందన్నారు.చూసారుగా పనికి రాని ఆటల వల్ల ప్రాణాలు ఎలా పాడైపోయి ప్రమాదాన్ని సృష్టిస్తాయో,ఇలాంటి ఎన్ని సంఘటనలు జరిగిన పిల్లల్లో మార్పు రాకుంటే తల్లి దండ్రులు నాలుగు తగిలిచ్చైనా దార్లో పెట్టాలని,మానసిక నిపుణులు చెబుతున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: