చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గర్వంతో విర్ర వీగి తనకు నచ్చిన పాలన చేయడం అలవాటు. గత 30 ఏళ్ల నుంచి బాబు గారు అదే చేశారు. మళ్ళీ ప్రతి పక్షంలోకి వచ్చి పడ్డప్పుడు నేను మారాను అని ప్రజల దగ్గర చెప్పడం.అయితే చంద్రబాబు ఇప్పటికే ఎప్పటికీ మారడని ప్రజలకు తెలుసు. గత ఐదేళ్లలో వైసీపీ పార్టీ నుంచి నేతలను కొనుగోలు చేసి విచ్చల విడిగా రాజకీయ వ్యభిచారం చేశారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఆది నారాయణ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు. ఇప్పుడేమో ఆది అసలు ఎక్కడ కనిపించడం లేదు. చంద్రబాబు ఇచ్చిన మంత్రి పదవి కోసం వచ్చారు. ఇప్పుడు అధికారం పోయేసరికి బాబును వదిలేశారు. 


అలాగే ఎన్నికలో పోటీ చేయకపోయిన నెల్లూరు నారాయణకు మంత్రి పదవి ఇచ్చి అందలం ఎక్కించారు. కానీ నారాయణ ఇప్పుడేమో వైసీపీ మీద అసలు విమర్శలు చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీ ఓకె అంటే దూకేందుకు సిద్ధంగా ఉన్నారు.  నెల్లూరు నారాయణ .. టీడీపీ పార్టీకి ఆర్ధికంగా వెన్ను దన్నుగా నిలబడి పార్టీకి ఎన్నికల్లో డబ్బు కొరత లేకుండా చూశారు. అయితే రాజధాని ప్రాంతంలో నారాయణకు సుమారు 2000 ఎకరాల భూమి బినామీ పేర్ల మీద  ఉన్నట్టు వైసీపీ ఆరోపిస్తుంది.


ఇప్పుడు ఆ దిశగా సాక్ష్యాలను సేకరించే పనిలో ఉంది. నెక్స్ట్ టార్గెట్ నారాయణతో కలిపి మొత్తం ఐదుగురు టీడీపీ నేతలు కేసుల్లో బుక్ అవుతారని చెప్పాలి. ఇప్పటికే కోడెల శివ ప్రసాద్ మీద కేసులు బుక్ అయ్యాయి. అయితే నారాయణ తరువాత లిస్ట్ లో గంటా శ్రీనివాస్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాస్ అప్పట్లో విశాఖ లో పెద్ద భూ కుంభకోణంలో గంటా హ్యాండ్ ఉన్నట్లు ఏకంగా టీడీపీ నేత ఆరోపించిన పరిస్థితి.  

మరింత సమాచారం తెలుసుకోండి: