హర్యానా కాంగ్రెస్ కమిటీ  ప్రక్షాళనం

 గత పార్లమెంట్ ఎన్నికలలో  దారుణమైన ఓటమి అనంతరం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రక్షాళన చేసే కార్యక్రమం ప్రారంభించింది.   ఈ ప్రక్షాళన లో భాగంగా హర్యానా కాంగ్రెస్ కమిటీకి సారథిగా మాజీ కేంద్రమంత్రి కుమారి సెల్జా నియమించబడ్డారు.  హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడం,  అక్కడి కాంగ్రెస్ నేతల కుమ్ములాటలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ అధిష్టానం కుమారి సెల్జా  నియామకానికి ఆమోద ముద్ర వేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.


తనను హర్యానా కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షురాలుగా నియమించినందుకు హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన  కుమారి సెల్జా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో హర్యానాలో కాంగ్రెస్ పార్టీని తప్పనిసరిగా అధికారంలోకి తీసుకొస్తామని  ధీమా వ్యక్తం చేశారు. నేతలంతా ఐకమత్యంతో పని చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకొని మళ్లీ అధికార పీఠాన్ని అధిష్టించడానికి  చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 


 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానా రాష్ట్రంలో 2014 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు మాత్రమే గెలుచుకున్నది

 

దళిత సామాజిక వర్గానికి చెందిన సెల్జా ను  రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడం వల్ల రాష్ట్రంలోని దళిత ఓటర్లను తమ వైపుతిప్పుకోవడం సులువు అవుతుందని వ్యూహంతో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.   కుమారి సెల్జా తండ్రి అయిన చౌదరి దల్వీర్‌సింగ్‌ కూడా అ ఒకప్పుడు హర్యానా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించి ఉండడం కొసమెరుపు



మరింత సమాచారం తెలుసుకోండి: