జగన్ అధికారంలోకి రావడానికి ఎంతో  కష్టపడ్డాడు అన్నది నిజం. ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్సార్ కొడుకుగా ఇమేజ్ ఉన్నా కూడా ఈజీగా సింహాసనం ద‌క్కలేదు. దాన్ని అందుకోవడం కోసం పదేళ్ల పోరాటం చేశాడు. సుదీర్ఘమైన ఉద్యమాన్నే చేశాడు, ఇంటా బయటా జగన్ యుధ్ధం చేస్తూనే ఉన్నాడు. తన వాళ్ళెవరో పరాయివాళ్ళు ఎవరో సైతం తెలియక  చీకట్లో కొట్టుమిట్టాడుతున్నా కూడా జగన్ ధైర్యం కోల్పోలేదు.


బహుశా అదే ఈ రోజు జగన్ని బంపర్ మెజారిటీతో అందలం ఎక్కించింది. ముఖ్యమంత్రిగా తిరుగులేని ఆధిక్య‌తను అంధించింది. ఇదిలా ఉండగా జగన్ రాజకీయ ప్రవేశమే ఓ సాహసం. . అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని కాలదన్నుకుని ఆయన బయటకు వచ్చారు. నాటి నుంచి టీడీపీ సహా అన్ని పార్టీలకు జగన్ టార్గెట్ అయిపోయారు. ఇక జగన్ మీద అన్ని రకాలైన ఆరోపణలు చేయడం మొదటినుంచి అలవాటు అయిపోయింది. రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఏది జరిగినా అది జగన్ కి ముడిపెట్టి బదనాం చేయడం అలవాటుగా చేసుకున్నారు తెలుగు తమ్ముళ్ళు.


బీజేపీలోకి వెళ్ళినప్పటికీ ఇంకా టీడీపీ వాసనలు పోని సుజనా చౌదరి జగన్ వందరోజుల పాలన బాగాలేదనే చెప్తారని అందరికీ తెలుసు. ఆయన ఏ రోజు కూడా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయలేదన్నది తెలుసు. ఇక కొన్ని రోజులు మౌనంగా ఉన్న సుజనాచౌదరి మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. రావడమే జగన్ని టార్గెట్ చేశారు. ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందట. కొత్త విషయమేదో చెబుతున్నట్లుగా సుజనా చెప్పడమే ఇక్కడ వింతలోకెల్లా వింత.


ఎందుకంటే రియల్ బూం డాం అని రెండేళ్ళు పైగా గడచిపోయాయి. ఇపుడు ఎటూ ఆర్ధిక మాంద్యం దేశంలో కనిపిస్తోంది. దాంతో రియల్ బూం డాం అనడమేంటి, అన్ని రకాలుగానూ ఇబ్బందులు వస్తాయని ఆర్ధిక నిపుణులు  ఓ వైపు గట్టిగా చెబుతున్నారు. మరి ఆ పాపం కూడా జగన్ నెత్తిన వేద్దామని సుజనా తయారైపోవడమే అసలైన మేలి మలుపు. మొత్తానికి లౌడ్ వాయిస్ తో సుజనా తెలుగుదేశం గొంతు బీజేపీ ఆఫీసులో కూర్చుని వినిపిస్తూంటే భలేగా ఉందంటున్నారంతా.


మరింత సమాచారం తెలుసుకోండి: