చంద్రబాబుకు  అధికారం పోయినా ఆరాటం మాత్రం పోవడం లేదు. జగన్ని ఎలాగైనా బదనాం చేయాలన్న ఒకే ఒక ఉద్దేశ్యంతో చేస్తున్న ఆరోపణలు ఓ వైపు తుస్సుమంటున్నాయి. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిగా ఈ రాజకీయ కురువ్రుధ్ధుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బాబు మార్క్ పాలిటిక్స్ ఎపుడూ గాలి పోగుచేయడమే. ఎదుటివారి మీద బురద జల్లడమే ఉంటుందని ఓవైపు వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నా బాబు ఎక్కడా తగ్గడంలేదు. చలో పల్నాడు పిలుపు వెనక అసలు విషయం తెలిస్తే షాక్ తినాల్సిందే.


ఎందుకంటే పల్నాడులో ఎప్పటినుంచో కక్షలు, కార్పణ్యాలు ఉన్నాయి. అక్కడ పార్టీల కంటే కూడా వర్గాలుగానే పోరు సాగుతుంది. చెప్పాలంటే అయిదేళ్ల బాబు పాలనలో వైసీపీ క్యాడర్ని అసలు బతకనినిచ్చేవారు కూడా కాదుట.  చాలా మంది మీద దాడులు చేస్తూ పోయారు. ఓ విధంగా పచ్చ పార్టీ అధికారంలో ఉన్నపుడు శత్రు సంహారమే  సాగింది. ఎప్పటికీ టీడీపీనే అధికారంలో ఉంటుందన్న ధీమాతో పచ్చ పార్టీ వర్గంలో ఉన్న వారు చేసిన ఘాతుకాలు అవి.


ఇపుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. సహజంగానే ప్రత్యర్ధి మీద దాడులకు అవకాశం ఉంది. ముందే చెప్పుకున్నట్లుగా అక్కడ పార్టీల కంటే వర్గ పోరే ఎక్కువగా ఉంటుంది. దాంతో పచ్చ పార్టీ హయాంలో హవా చలాయించిన వర్గీయులంతా తమపైన దాడులు తప్పవని ముందస్తుగా గ్రామాలను విడిచి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వారంతా చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టి తమకు సొంత వూళ్ళో రక్షణ లేకుండా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.


బాబు అయిదేళ్ల పాటు సీఎం గా పనిచేశారు. ఆయనకు వాస్తవాలు తెలియాలి. లేకపోతే తెలుసుకోవాలి. కానీ ప్రతీది రాజకీయం చేయడానికి అలవాటు పడిన బాబు దీన్ని కూడా అనుకూలంగా మలచుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ వర్గంగా చెప్పుకుంటున్న వారిని ఎవరినీ ఏమీ చేయకపోయినా వారు గతంలో చేసిన అక్రుత్యాలు గుర్తు చేసుకుని పారిపోయారని, ఇపుడు వారికి రక్షణ లేదని, శిబిరాలు, పునరావాసాలు పేరిట రాజకీయ డ్రామాలు  కధలేంటని  వైసీపీ నేతలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు.


పల్నాడులో ఇలాంటివి మామూలే, ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరో పార్టీ నేతలు గమ్మున ఉంటారు, ఇపుడు మాత్రం బాబు దీన్ని ఎక్కువ చేస్తున్నారని అక్కడ వారే అంటున్నారు. నిజానికి బాబు  హయాంలో కన్నా జగన్ పాలనలో పల్నాడు ప్రశాంతంగా ఉందని ఇపుడు బాబు చలో పల్నాడు పేరిట కొత్త చిచ్చు పెడుతున్నారని అంటున్నారు. మొత్తానికి దీని వెనక టీడీపీ క్షుద్ర రాజకీయమే ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: