యూరేనియం తవ్వకాలు గతకొంత కాలంగా ప్రజలకు నిద్రలేకుండ చేస్తున్న సమస్య.ఇప్పటికే దీనిపై ప్రజలు పోరాటం చేస్తున్నారన్న విషయం తెలిసిందే ఈ తవ్వకాలు ఆపాలని తవ్వకాలకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి నష్టం చేకూరుతుందని, జీవవైవిధ్యం నాశనం అవుతుందని, యురేనియం తవ్వ కాలతో కృష్ణా జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని,అదే జరిగితే ప్రజలు క్యాన్సర్‌, మూత్రపిండ వ్యాధుల బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు ఉంటుందని నేతలు చెబుతున్నారు.



అయినాగాని పర్యావరణ పరిరక్షకులు,ప్రజలు ఇంతలా ఆందోళన చెందుతున్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని మార్చుకోవడం లేదని అందుకే ఆయా ప్రాంతాలలోని నివాసితులంతా యురేనియం నిల్వలు వెలికి తీసేందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నామన్నారు. ఇకపోతే ఈ ప్రదేశమంతా  శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయ తీరాలలోనే ఉండటంతో జరుగబోయే నష్టాన్ని సరిగ్గా అంచన వేయలేక కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో యురేనియం తవ్వకాల సర్వే కోసం వచ్చిన అధికారులను ఓ లాడ్జి వద్ద తెలంగాణ విద్యావంతుల వేదిక నేతలు అడ్డుకుని వెనక్కి పంపేశారు. దీంతో దేవరకొండలో ఉద్రిక్తత నెలకొంది.నల్లమల్లలో ప్రవేశిస్తే  ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.



సోమవారం రాత్రి కొంతమంది అధికారులు దేవరకొండ సమీపంలోని ఓ లాడ్జ్‌లో బస చేశారు.వీరంతా యురేనియం తవ్వకాల్లో భాగంగా,నల్లమల్ల అడవుల్లో పర్యటించేందుకు ఇక్కడకు చేరుకున్నారని తెలుసుకున్న విద్యావంతుల వేదిక నాయకులు వారిని అడ్డుకున్నారు.నల్లమల్లకు వెళ్లొదంటూ తీవ్రంగా ప్రతిఘటించారు.గో బ్యాక్‌ అంటూ చేసే వారి నినాదాలతో దేవరకొండ సమీప ప్రాంతాలు దద్దరిల్లాయి.విషయం తెలుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ సందర్భంగా ఆ అధికారులు తాము సర్వే శిక్షణ కోసం వచ్చామని తెలపడం పలువురిని ఆశ్చర్య పరచింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: