ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మృతితో ఏపీ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోడెల భౌతిక కాయానికి పోస్ట్ మార్టం అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి కోడెల మృతదేహానికి తరలించగా అక్కడ పలువులు నేతలు నివాళులు అర్పించిన సంగతి తెలిసందే.  సాయంత్రం కోడెల భౌతికకాయాన్ని సొంతూరు నర్సారావు పేటకు తరలించనున్నారు. కాగా కోడెల మృతి ఏపీలో రాజకీయ దుమారం లేపింది. ఫోరెన్సిక్ నివేదికలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలగా...వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని  టీడీసీ నేతలు ఆరోపిస్తున్నారు .


ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం పై పలు విమర్శలు చేశాడు. ఫోరెన్సిక్ నివేదికలో కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు తేలిందని ... ప్రభుత్వం పోలీసులు సాక్షి  మీడియా వేధింపుల వల్లే మనస్థాపానికి గురై ఆయన ఆత్మహత్య అచేసుకున్నాడని ఆరోపించారు. అయిలే  కోడెల కుమారుడే కోడెలను చంపాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు .   


37  ఏళ్ళ కోడెల రాజకీయ ప్రస్థానంలో 27 సంవత్సరాలు కోడెల ఎమ్మెల్యే గా పని చేశారని తెలిపారు. పల్నాడు పులిగా పిలువబడే కోడెల ...వైసీపీ వేధింపుల వల్లే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల మృతికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. అయితే నెల్లూరులో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ...తక్షణమే నిషేధాజ్ఞలను ఎత్తివేసి కోడిల పార్థివ దేహానికి అభిమానులు పార్టీ శ్రేణులు ఘనంగా వీడ్కోలు పలికేందుకు అవకాశం కల్పించాలన్నారు .

వైసీపీ ప్రభుత్వం వల్లే కోడెల ఆత్మ హత్య చేసుకున్నాడని వస్తున్నా ఆరోపణల పై ఏపీ మంత్రి  కొడాలి నాని స్పందించారు   .కేసులు పెడితే చనిపోకూడదు పోరాడాలి అని అన్నారు.కోడెల పై కేసులు ప్రభుత్వం పెట్టలేదని కోడెల బాధితులే పెట్టారన్నారు .చంద్రబాబు కోడెలను పట్టించుకోకుండా పక్కకు పెట్టడం వల్లే మనస్థాపానికి గురై  కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: