1950వ దశకంలో భారత టెస్టు ఓపెనర్‌గా సేవలందించిన భారత మాజీ క్రికెటర్‌,ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మాధవ్‌ ఆప్టే(86) కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్‌ కాండే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం (సెప్టెంబర్ 22న) మృతి చెందారు.మరికొన్ని రోజుల్లో ఆప్టే పుట్టినరోజు కాగా,సెలబ్రేట్ చేయాలని కుటుంబసభ్యులు అనుకుంటున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకుంది.



పలువురు క్రికెటర్లు,మాజీలు ఆప్టే మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఇక ఈయన 1932లో ముంబైలో జన్మించారు..లెగ్ స్పిన్నర్‌గా వినూ మన్కడ్ కోచింగ్‌లో కెరీర్ ఆరంభించారు మాధవ్ ఆప్టే..అనంతరం బ్యాట్స్‌మెన్‌గా కెరీర్ కొసాగించి,టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు.ఓవల్ టెస్టులో ఆప్టే ప్రదర్శన కారణంగానే క్రికెట్ దిగ్గజం సర్ డోనాల్డ్ బ్రాడ్‌మన్ టెస్టుల్లో సగటు 100% పరుగులను అందుకోలేకపోయాడని చెబుతుంటారు.ఇక వెస్టిండీస్ కు చెందిన నాటి దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్‌ కింగ్‌, జెర్రీ గోమెజ్‌, ఫ్రాంక్‌ వారెల్‌ లను దీటుగా ఎదుర్కొంటూ రెండు సెంచరీలు సాధించారు.1989లో క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.



భారత లెజెండ్స్ క్లబ్‌కు చీఫ్‌గా కూడా వ్యవహరించారు.ఇదే క్లబ్ తరఫున సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల వయసులోనే మ్యాచ్ లు ఆడి సత్తా చాటారు.ఇక వచ్చే నెల (అక్టోబర్) 5వ తేదీన మాదవ్ ఆప్టే 87వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ఈయన 1950వ దశకంలో భారత టెస్టు ఓపెనర్‌గా సేవలందించారు.1952-53 మధ్య కాలంలో మాధవ్‌ ఆప్టే టీమిండియా తరఫున ఏడు టెస్టులాడి 542 పరుగులు చేశారు. ఓ శతకం,మూడు అర్ధ శతకాల సాయంతో 49.27 సగటుతో రాణించారు.ఓవరాల్‌గా 67 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన ఆప్టే.. ఆరు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల సాయంతో 3,336 పరుగులు చేశారు.క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా మాధవ్‌ ఆప్టే సేవలందించారు.ఇక మాధవ్ ఆప్టే మృతికి బీసిసిఐ తోపాటుగా పలువురు క్రికెటర్లు,పలువురు ప్రముఖలు సంతాపం తెలిపారు.ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: