గొప్ప  ఘన చరిత్ర కలిగిన ఎస్వీయూలో సభ్యసమాజం సిగ్గు పడే విధంగా   ఓ వికలాంగుడని  అక్కడి సిబ్బంది..  విచక్షణ జ్ఞానం కూడా లేకుండా  మాటల దాడితో, హావ భావాలతో  మానసికంగా ఇబ్బంది పెట్టిన,  దారుణమైన సంఘటన గురించి తెలిసిందే.  ఎందరో మేధావులను దేశానికి  అందించిన గొప్ప చరిత్ర ఈ విశ్వా విద్యాలయానిది.   ఇక్కడ చదివి ఎంతో జ్ఞానాన్ని సంపాదించి  ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్ళు ఎందరో..  అంతటి మహోన్నత  ఘన చరిత్ర గలిగిన విద్యాలయంలో  ఇలాంటి  చేదు  సంఘటన జరిగింది.  కేవలం ఒక ఇంచార్జ్ రిజిస్టర్ తీరు, ఇప్పుడు మొత్తం యూనివర్సిటీకే  మాయని మచ్చలా  మిగిలిపోవడం అత్యంత బాధాకరం.  పట్టపగలే యూనివర్సిటీలో  ఇలాంటి ఘటన జరగటం సిగ్గు చేటు అని చెప్పడం కూడా చాలా చిన్నపదం అవుతుంది. అయినా విద్యార్థులకు బుద్దులు చెప్పాల్సిన సిబ్బందే... ఇలా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటే.. వాళ్ళను ఏమి చేయాలి ?  ఒక వికలాంగుడు అని కూడా చూడకుండా నిర్బంధించి  పక్కా రౌడీల్లా ప్రవర్తించారంటే.. వారి గురించి ఏమనుకోవాలి ?   కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు సాంకేతిక సర్వీసులని అందిస్తున్న  ఆ కంపెనీ ప్రతినిధికే ఈ గతి పడితే.. ఇక మాములు స్థాయి వ్యక్తికి ఎలాంటి గతి పడుతుందో..?  


 
పైగా  రిజిస్టర్ ఆఫీస్ కి రమ్మని పిలిచి..   ఒక వికలాంగుడు అని కూడా చూడకుండా.. పది మంది సిబ్బంది మాటల దాడి చేస్తూ కించపరుస్తూ..  కనీస జాలి కూడా లేకుండా బలవంతంగా తమకి  కావాల్సిన డాక్యుమెంట్ల పై సంతకం చేయించుకున్నారంటే..  ఇంతకన్నా అమానుషం ఇంకోటి ఉంటుందా ? మరి ఇలాంటి ఘోరమైన ఘటన జరిగింది ? ఈ ఘటన.. ఆ రోజుకి ఒక న్యూస్ లా మిగిలిపోకూడదు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలి. అసలు  ఈ ఘటన వెనుక అసలైన కారణం ఏంటో తెలుసా..  ఈ ఘటనకు పాల్పడిన వారంతా  గత ప్రభుత్వానికి వీరాభిమానులు అట.  గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరు ఆడిందే ఆట పాడిందే పాట.. అలాగే ఇప్పుడు ప్రవర్తించారు. చివరికీ  ఎస్వీయూ ఘోరంలో రాజకీయ కోణం ఉండటం,   మొత్తం విశ్వ విద్యాలయానికే అవమానకరం అయింది. ఇప్పటికైనా ఇలాంటి విలువులు లేని  సిబ్బందిని తప్పించి..  ప్రతిభ ఉన్న విద్య విలువ తెలిసిన  కొత్త సిబ్బందిని జగన్  నియమిస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు.   ఏమైనా, జ్ఞానం కోసం  విశ్వ విద్యాలయానికి  వచ్చిన విద్యార్థులకు..  పచ్చ పార్టీ తత్వం నూరి పోయటం వారి భవిష్యత్తుకే ప్రమాదకరం.     



మరింత సమాచారం తెలుసుకోండి: