జగన్ అన్న మూడు అక్షరాలు ఇపుడు టీడీపీకి పూనకం తెప్పిస్తున్నాయి. జగన్ పాదయాత్ర చేపట్టినపుడు పాదయాత్ర కాదు, మోకాలి మీద నడచినా కూడా ముఖ్యమంత్రి కాలేరని అన్నవి పసుపు గొంతులే. జగన్ దేశం మొత్తం కాలి నడకన తిరిగినా మళ్ళీ ఆయన పార్టీ గెలవ‌దని కూడా సెటైర్లు వేసినది ఈ సైకిల్ బాబులే. జగన్ పార్టీ కేవలం కడప జిల్లాకే పరిమితమని, అది కూడా పులివెందుల పార్టీ అని ఎగతాళీ చేసినదీ ఈ టీడీపీ నేతలే.


ఇపుడు వారికి జగన్ బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి కావడంతో మైండ్ బ్లాంక్ అవుతోంది. జగన్ కి ఇంతటి ఆదరణ ఏంటి అన్నది వారికి అంతుబట్టక కొన్నాళ్ళు గడిపేసిన వారంతా ఇపుడు నెమ్మదిగా జనంలోకి వస్తున్నారు. జగన్ విధానాలపైన తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. వారిలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఉన్నారు.


ఆయన జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. మీడియాతో మాట్లాడిన అయ్యన్న జగన్ రక్తంలోనే ఫ్రాక్షనిజం ఉందని హాట్ కామెంట్స్ చేసారు. జగన్ ఏపీ మొత్తాన్ని ఫ్రాక్షన్ మయం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఇక పోలీసులు సైతం అధికార పార్టీకి వంతపాడుతున్నారని, ఇది దారుణమని కూడా అయ్యన్న వాపోయారు.


జగన్ వంద రోజుల పాలనలో సాధించినది శూన్యమని అయ్యన్న విమర్శించారు.  జగన్ పాలన అంటే పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని కూడా ఆయన అన్నారు. జగన్ అయోమయం పాలనతో ఏపీ అభివ్రుధ్ధిని పదేళ్ళు వెనక్కి తీసుకుపోతున్నాడని ఆయన అన్నారు. జగన్ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలూ అశాంతిగా ఉన్నారని కూడా అన్నారు. మొత్తానికి తమ్ముళ్ళ అసహనం, అశాంతి మాత్రం అయ్యన్న మాటల్లో బాగానే వినిపించాయి.  అయ్యన్నపాత్రుడు తమ్ముడు వైసీపీలో తొందరలో చేరుతారని కూడా అంటున్న నేపధ్యం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: