ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ కు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో  దిగజారిపోతున్న శాంతిభద్రతలు, చీరాలలో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి పై హత్యాయత్నం సహా పలు అంశాలపై చంద్రబాబు లేఖలో  ప్రస్తావించారు. గడిచిన మూడు నాలుగు నెలల నుంచి రాష్ట్రంలో ప్రజలకు వాక్ స్వాతంత్రం లేకుండా పోయిందని... చరిత్రలో ఎన్నడూ లేనంతగా లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని  డిజిపి గౌతమ్ సవాంగ్ రాసిన  లేఖలో ఆరోపించారు చంద్రబాబు నాయుడు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. 

 

 

 వైసీపీ ప్రభుత్వం ఎమ్మెస్వోలను బెదిరించి పలు టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేశారని... సామాజిక కార్యకర్తలు,  జర్నలిస్టుల మీద వైసీపీ పార్టీ నేతలు దాడులు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని చంద్రబాబు నాయుడు లేఖలో  ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సామాజిక కార్యకర్త నాగార్జున రెడ్డి మీద వైసీపీ పార్టీ నేతలు దాడి చేశారన్నారు. ప్రస్తుతం నాగార్జున రెడ్డి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని  అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల మీద ఎవ్వరు ఫిర్యాదు చేసిన  కేసులు నమోదు చేయడం లేదని చంద్రబాబు లేఖలో స్పష్టం చేసారు . 

 

 

 ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతిపక్షాలపై మాత్రం పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  శాంతిభద్రతల పరిస్థితి ఆందోళన కలిగించేలా ఉందని ... సత్యమేవ జయతే అనే విధానాన్ని  అనుసరించి పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని చంద్రబాబు లేఖలో పోలీసులను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: