భారత దేశంలో గత కొంత కాలంగా ఉగ్రవాదులు ఎక్కడబడితే అక్కడ దాడులు నిర్వహిస్తూ..సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నారు.  ఆ మద్య బాలకోట్ లో జరిగిన దాడికి మన భారత సైన్యం సరైన బుద్ది చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకాశ్మీర్ కి సంబంధించిన 370 ఆర్టికల్ రద్దు చేసినప్పటి నుంచి దాయాది దేశమైన పాకిస్థాన్ కి కంటిమీద కునుకు లేకుండా పోయింది..ప్రతి చిన్న విషయంపై భారతపై విరుచుకుపడుతుంది. 

ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను మరోసారి రెచ్చగొట్టి భారత్ భూభాగంపైకి పంపిస్తున్నట్లు సమాచారం.  ఇప్పటికే దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించించి కేంద్ర ప్రభుత్వం. తాజాగా జమ్ములోని రాంబాన్ జిల్లా బటోట్ ఏరియాలో ఈ ఉదయం నుంచి ఉగ్రవేట కొనసాగుతోంది.బటోట్ పట్టణంలో ఆర్మీ, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా కొంతమంది ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. 

ఉగ్రవాదులు పారిపోతూ అక్కడే ఉన్న ఓ ఇంట్లోకి దూరి… అందులోని కుటుంబసభ్యుల్లో ఒకరిని తమ దగ్గర బందీగా పెట్టుకుని  మిగతావారిని బయటకు పంపించారు.  ఆ ఇంట్లో ఐదురు ఉగ్రవాదులు ఉన్నట్లు కశ్మీర్ పోలీసులు చెప్పారు. ఆ భవనాన్ని సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయని పోలీసులు చెప్పారు. బందీగా ఉన్న వ్యక్తిని కాపాడి… ఉగ్రవాదులను ఆట కట్టించేందుకు  సైన్యం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. అయితే పోలీలు పూర్తి తరహా ఉగ్రవాదులకు ఉచ్చు బిగిస్తున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: