ఈ కలియుగంలో డబ్బు కోసం యువతీ, యువకులు ఏమైనా చేస్తారు. కోటి రూపాయలు ముందు పెట్టి మనిషిని చంపమంటే ఆలోచించకుండా మనిషిని కిరాతకంగా చంపేస్తారు. ఇంకా వివరాల్లోకి వెళ్తే ... మధ్యప్రదేశ్‌ హనీ ట్రాప్‌ సెక్స్‌ స్కాంలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. లిప్‌స్టిక్‌ల్లో, కళ్లద్దాల్లో రహస్యంగా కెమెరాలు అమర్చి ప్రముఖుల రాసలీలలు చిత్రకరించారని పోలీసులు తెలిపారు.                       


మాజీ ముఖ్యమంత్రి ఒకరు ఒక యువతితో ఓ హోటల్‌ గదిలో చేస్తున్న రాసలీలల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరికొంతమంది ప్రముఖులకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవి చాలావరకు నకిలీ వీడియోలు అని తెలుస్తుంది. కొందరు మహిళలు మధ్య తరగతి అమ్మయిలను రాజకీయనేతలకు, ఉన్నతాధికారులకు ఏరా వేసి పనులు చేయించుకుంటున్నారు.                       


ఇలా కోట్లు సంపాదించిన స్కామ్‌ ఒకటి తాజాగా మధ్యప్రదేశ్‌ లో వెలుగు చూసింది. కాగా ఆ యువతులతో అధికారులు ఉన్న సమయంలో వీడియోలు చిత్రీకరించి, బ్లాక్‌ మెయిల్‌ చేసి పనులు చేయించుకునేవారు. ఓ సీనియర్‌ ఇంజినీర్‌ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేయగా, ఇందుకు సంబంధించి ఆర్తి దయాల్, మోనిక యాదవ్, శ్వేత విజయ్‌ జైన్, శ్వేత స్వప్నిల్‌ జైన్, బర్ఖా సోని, ఓం ప్రకాశ్‌ కోరిలను సిట్‌ అరెస్ట్‌ చేసింది.                          

                 

మరింత సమాచారం తెలుసుకోండి: