తెలుగుదేశం పార్టీ అంటే అన్ని ప్రాంతాలు ఆదరించిన పార్టీగా అన్న నందమూరి తారకరామారావు టైంలో ఉండేది. ఆయనకు రాజకీయలు తెలియకపోవడం, సినీ రంగంలో అన్ని వర్గాల మద్దతు ఆయన పొందడం వంటి కారణాల వల్ల కులాలకు అతీతంగా ఆయన్ని అందరూ అభిమానించారు. అలాగే ప్రాంతాలకు అతీతంగా టీడీపీకి పట్టం కట్టారు. ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆయన కులాలు, ప్రాంతాల సమీకరణలు బేరీజు వేసుకుంటూ తనదైన శైలిలో రాజకీయాలు నడిపారు.


ఈ నేపధ్యంలో ఆయన్ని అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఒక వర్గం ఆదరిస్తే మరో వర్గం పక్కన పెట్టేది. అలాగే ఒక ప్రాంతం అక్కున చేరుకుంటే మరో ప్రాంతం  వెనక్కు నెట్టేది. ఇక చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడు అయ్యాక  చూసుకుంటే రాయలసీమ సెగ్మెంట్  మొత్తం ఆయన పార్టీని పక్కన పెట్టేసింది. ఉమ్మడి ఏపీలో ఒకసారి బీజేపీ పొత్తుతో 1999లో గెలిచిన చంద్రబాబు ఆ తరువాత  2004, 2009 ఎన్నికల్లో  రెండుసార్లు ఓటమి పాలు అయ్యారు.


ఇక 2014లో ఆయన పార్టీ గెలిచినా రాయలసీమ వరకూ తక్కువ సీట్లే వచ్చాయి. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో చూసుకుంటే జీరో మార్కులు సీమలో బాబు పార్టీకి వచ్చాయి. దానికి తోడు కోస్తాలో కూడా టీడీపీ చాప చుట్టేసింది. మళ్ళీ టీడీపీని ఇక్కడ ఆదరిస్తారనుకుంటే మాత్రం అది కష్టమని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాపులు టీడీపీకి దూరం అవుతున్నారు. కోస్తాలో ఉన్న ఆరేడు జిల్లాలో వీరి ప్రభావం చాలా ఎక్కువ. వీరు టీడీపీని నమ్మడం మానేశారనడానికి అనేక మంది పార్టీ నుంచి వేరు పడిపోవడమే కారణం అంటున్నారు. తాజాగా ఈ రోజు మాజీ మంత్రి శనక్కాయ అరుణ బీజేపీలో చేరారు.


ఇక అంతకు ముందు తోట త్రిమూర్తులు, పరుపుల రాజా కూడా సైకిల్ దిగేశారు. ఎన్నికల ముందు ఆమంచి క్రిష్ణ మోహన్, అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు.  ఇక మరింతమంది మాజీ మంత్రులు, కాపు నేతలే టీడీపీ నుంచి బయటపడడానికి చూస్తున్నారు. మరో వైపు బీసీలు టీడీపీకి పెట్టని కోటగా ఉంటున్నారు. తాజా ఎన్నికల్లో వారు వైసీపీ వైపు మళ్ళారు. రాయలసీమలో టీడీపీకి అసలే పట్టు లేదు. కోస్తాలోనే సీట్లు గెలిచి రేపటి రోజున అధికారంలోకి రావాలి. మరి ఇక్కడ కూడా టీడీపీకి దుకాణం బంద్ అయితే ఖల్ ఖతం అయినట్లేనని అంటున్నారు. చూడాలి రానున్న రోజుల్లో టీడీపీ ఈ పరిణామాలను ఎలా తట్టుకుని నిలబడుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: