తెలంగాణలో ఆర్టీసీ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని ఆర్టీసీ కార్మికులకు భద్రత లేకుండా పోయిందని... తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులకు  ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ  ప్రభుత్వ పరం చేయటం వల్ల ఆర్టీసీ కార్మికుల జీవితాలు మెరుగుపడటంతో పాటు ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికులు.ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు త్రిసభ్య కమిటీ చర్చలు  విఫలమయ్యాయి. దీంతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సరైన హామీ ఇచ్చేంత వరకు సమ్మెను విరమించే ప్రసక్తి లేదని ఆర్టీసీ సంఘాలు స్పష్టం చేశాయి. 

 

 

 

 

 ఈ నేపథ్యంలో అక్టోబర్ 5 నుంచి సమ్మె చేసి తీరుతామని ఆర్టీసి జేఏసీ  స్పష్టం  చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ బి ని అమలు చేసింది . ఆర్టిసి కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడు ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలిక కండక్టర్లను బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా తాత్కాలికంగా పనిచేయడానికి కనీసం వారికి 18 నెలల అనుభవం కలిగి ఉండాలని అలాగే హెవీ  ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కలిగి  ఉండాలని ప్రకటించింది ప్రభుత్వం. కాగా  కండక్టర్ గా  చేయాలనుకునేవారు పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది అని చెప్పింది. 

 

 

 

 

 డ్రైవర్లకు రోజుకు 1500 కండక్టర్లకు వెయ్యి రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డ్రైవర్ గా పని చేయాలనుకునేవారు ఒరిజినల్ లైసెన్స్ ఆధార్ కార్డ్... కండక్టర్లు టెన్త్ మేమో ఆధార్ కార్డుతో డిపో మేనేజర్ కార్యాలయం లో దరఖాస్తు  చేసుకోవాలని సూచించింది ఈ మేరకు అన్ని డిపోల్లో సర్క్యులర్ కూడా జారీ చేసింది ప్రభుత్వం . అయితే దీనిపై ఆర్టీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కావాలని ఆర్టీసీ కార్మికులను రెచ్చ  గొడుతున్నారని ఆర్టీసీ జేఏసీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: