ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్‌ మోగింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు ఈ నెల ఐదో తారీఖు నుంచి నిరవధిక సమ్మెను ప్రకటించిన సంగతి తెల్సిందే,ఈ నేపద్యంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు చేస్తున్న సమ్మె ఎన్నిరోజుల వరకు కొనసాగుతుందో తెలియదు,ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాజధాని హైదరాబాద్‌లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో అధికారులు చర్యలు తీసుకున్నారు.బంద్‌ వల్ల నగర ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు సర్వీసులు నడిపేందుకు,హైదరాబాద్‌ మెట్రో రైల్‌ చర్యలు చేపట్టాయి.



నాగోల్‌–సికింద్రాబాద్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌ మార్గంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు నడుపనున్నట్లు, అంతేకాకుండా మెట్రో తన సర్వీసుల సమయాన్ని పెంచుతున్నట్లు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.దీంతో మార్నింగ్ ఐదు గంటల నుంచి ఆర్ధరాత్రి పన్నెండున్నర వరకు మెట్రో సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు.అంతేకాకుండా రద్ధీని పురస్కరించుకుని అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.ఇక,ఆర్టీసీ సమ్మెపై అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం ఢీ అంటే ఢీ అంటూ,పట్టుదలకు పోవడంతో సమ్మె అనివార్యమైంది.హామీలను లిఖతపూర్వకంగా ఇవ్వాలని త్రిసభ్య కమిటీకి ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు సూచించారు.అయితే అటువంటి కొత్త విధానాలను తీసుకు రాబోమని త్రిసభ్య కమిటీ కార్మిక సంఘాల నేతలకు తెల్చి చెప్పింది.



ఎవరికి వారు పట్టదలను వీడకపోవడంతో సమస్య కొలిక్కిరాలేదు.మరోపక్క సమ్మెపై కార్మి సంఘాల జేఎసీ నేతతలతో కార్మిక శాఖ అధికారులు జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయి.‘మీ డిమాండ్లు పరిష్కరించడం మావల్ల కాదు’అని కార్మిక శాఖ అధికారులు చేతులేత్తేశారు.ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు సూచిస్తున్న అంశాలు తమ పరిధిలో లేవని కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్ స్పష్టం చేశారు.ఇలావుంటే,సమ్మె ప్రభావంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు శుక్రవారం సాయంత్రం నుంచే నిలిచిపోవడంతో,ప్రయాణికులు ఆందోళనకు గురైయ్యారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఇటు ప్రభుత్వంగానీ,అటు ఆర్టీసీయాజమాన్యం గానీ పట్టించుకున్నపాపాన పోవడంలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: