వైసీపీ ఒకపుడు టీడీపీ నిర్వహించిన పాత్రను ఏపీలో పోషిస్తోంది. ఆ పార్టీ ఎంతో మంది కొత్తవారిని ఈసారి బరిలో నిలిపి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంది. అతి పిన్న వయసు కలిగిన వారు కూడా మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న ఘనత జగన్ సర్కార్ కల్పించింది. అదే విధంగా చిన్న వయసులోనే పార్లమెంట్ గడప తొక్కించిన గొప్పతనం కూడా ఆ పార్టీ సొంతం చేసుకుంది.


ఆ విధంగా చూసుకుంటే వైసీపీ తరఫున అరకు ఎంపీగా పోటీ చేసి గెలిచిన గొడ్డేటి మాధవికి పట్టుమని పాతికేళ్ళు కూడా ఉండవు. తండ్రి సీపీఐలో పనిచేసిన నేత. ఎమ్మెల్యేగా గెలిచి జనం విశ్వాసం చూరగొన్న నాయకుడు. ఆ తండ్రి రాజకీయ వారసురాలిగా మాధవిని జగన్ ఎంపిక చేసి అరకు లాంటి పార్లమెంట్ సీట్లో గెలిపించుకున్నారు. తాను పోటీ చేసేందుకు వెనకాడుతున్నా నేనున్నాను అంటూ జగన్ ఇచ్చిన మద్దతుతో  మాధవి ఒక్కసారిగా ఎంపీగా మారిపోయింది.


ఆమె ఓడించింది కూడా ఎవరినో కాదు, రాజకీయ కురువ్రుద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ని. దాంతో జెయింట్ కిల్లర్ గా మాధవి  పేరు మారు మోగింది. ఇదిలా ఉండగా మాధవి కి రెండున్నర లక్షల పై చిలుకు మెజారిటీ రావడం మరో రికార్డు. ఇన్ని రకాలుగా మాధవి పేరు ఒక్కసారిగా జనంలోకి వచ్చింది. ఆమె పూర్వాశ్రమంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో టెంపరరీ పీయీటీ టీచర్. అటువంటి ఆమె ఇపుడు పార్లమెంట్ మెంబర్ అయ్యారు.


ఓ దశలో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా మాధవి పేరుని పరిశీలించిన సందర్భం ఉంది. ఇదిలా ఉండగా మాధవి వివాహం ఈ నెల 17న విశాఖలో జరగనుంచి.  గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో ఆమె పెళ్ళి నిశ్చితార్ధం జరిగింది. మాధవి  కుటుంబానికి బాగా  సన్నిహితుడైన శివప్రసాద్ భర్త కాబోతున్నాడు. శివప్రసాద్ మాధవి కుటుంబాల మధ్య ఎప్పటి నుంచి మంచి అనుబంధం ఉండడంతో ఈ పెళ్ళి జరుగుతోంది. ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన శివప్రసాద్ ని మాధవి చేసుకుంటోంది. ఇదిలా ఉండగా తొందరలోనే ముఖ్యమంత్రి జగన్ కి కూడా పెళ్ళి శుభలేఖలు అందిస్తామని మాధవి సోదరుడు మహేష్ వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: