ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల నాయకుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అతి కొద్ది కాలంలోనే మంచి పేరు సంపాదించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 14 నెలల పాదయాత్రలో మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగి రాష్ట్రంలో ఉన్న కష్టాలన్నీ తెలుసుకొని అందుకు అనుగుణంగా ఆయన ఇచ్చిన హామీలు అన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దేశంలోనే బెస్ట్ సీఎం అని ముద్రవేసుకున్నాడు. అందులో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటి.

అధికారంలోకి వచ్చాక 'మే' లో తన హామీని నెరవేరుస్తూ అందుకు తగ్గ పనులు చకచకా జరిపారు. ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి సలహాలు మరియు సూచనలతో ఆర్టీసీ ఉద్యోగులు అందరూ ఇకపై రాష్ట్ర గవర్నమెంటు ఉద్యోగులేనని వారి కంటూ ఒక ప్రత్యేకమైన విభాగం కూడా కేటాయించేందుకు కసరత్తు మొదలు పెట్టాడు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం గతంలో తాను ఎన్నడూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తానని చెప్పలేదని అనేశాడు.

కానీ మనం గతాన్ని గుర్తు చేసుకున్నట్లయితే కెసిఆర్ ఎన్నికలకు ముందు చాలాసార్లు ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పరిగణించబడతారు అని... ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే అన్ని సదుపాయాలు వీరికి కుడా కల్పిస్తామని హామీ ఇచ్చాడు. ఒక వైపు జగన్ కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లేకుండా ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలోకి కలిపే ప్రక్రియ సాంకేతికంగా సాధ్యం కాకపోయినా ఇచ్చిన మాట మీద నిలబడి వారి జీతాలను పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉండగా మరొక వైపు కేసీఆర్ వారిని ఉద్యోగం నుండే తీసేస్తాను అని బెదిరించి చాలా క్లిష్టమైన పరిస్థితిని కొనితెచ్చుకున్నాడు.

ఇంకా ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును కూడా 58 నుంచి 60 కి పెంచాడు జగన్.  ఇలా ఇచ్చిన మాట మీద నిలబడి జగన్ అందరి అభినందనలు అందుకున్నారు. కెసిఆర్ మాత్రం ఇచ్చిన మాట తప్పింది కాకుండా వారిని ఉద్యోగాల నుండి తీసేస్తాను అని బెదిరించి తిట్ల పాలవుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: